బీ-ఫార్మసీ, ఫార్మ్-డీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల, స్వల్ప మార్పులు
అమరావతి: ఫార్మసీ కళాశాలల అనుమతి పొడిగింపునకు ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో రాష్ట్రంలోని బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల అడ్మిషన్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ఏపీఈఏపీ సెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ అభ్యర్ధులకు వెర్వేరుగా షెడ్యూల్ ఉంటుందన్నారు.
ఎంపీసీ విద్యార్ధులు నవంబరు ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆన్ లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆన్‌లైన్‌తో పాటు సహాయ కేంద్రాల వద్ద ధృవీకరణ పత్రాల వెరీఫికేషన్ కు నవంబరు 8, 9 తేదీలు కేటాయించామన్నారు. ఐచ్చికాల నమోదుకు నవంబరు 10, 11,12 తేదీలలో మూడు రోజుల పాటు అవకాశం కల్పించామని నాగరాణి వివరించారు.

12 తేదీ ఐచ్చికాల మార్పుకు అవకాశం ఉంటుందని, 14వ తేదీ సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని నాగరాణి పేర్కొన్నారు. నవంబరు 15, 16 తేదీలలో సీట్లు పొందిన అభ్యర్ధులు అయా కళాశాలల్లో స్వయంగా రిపోర్డు చేయవలసి ఉంటుదన్నారు.
బైపీసీ విద్యార్థులు కూడా నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. సహాయ కేంద్రాల వద్ద సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు నవంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజులు.. నవంబర్ 11 నుంచి 13 వరకు ఐచ్చికాల నమోదు ఉంటుంది. ఐచ్చికాల మార్పు నవంబర్ 14వ తేదీ, ఆ తర్వాత 17వ తేదీ సీట్లను కేటాయిస్తామని ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్ తెలిపారు. నవంబర్ 18 నుంచి 21 వరకు బైపీసీ విద్యార్థులు కాలేజీల్లో స్వయంగా రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications