బాహుబలి2 ఫీవర్: గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే బాహుబలి టికెట్ ఉచితం
బాహుబలి2 చిత్రానికి ఉన్న క్రేజ్ ను పలు సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఓ గ్యాస్ ఏజెన్సీ ఏకంగా సంచలన ప్రకటన చేసింది. వంట గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి బాహుబలి-2 సినిమా టికెట్‌ను ఉచితంగా
గుంటూరు: ఏప్రిల్ 28న విడుదలవుతున్న బాహుబలి 2 చిత్రానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతకా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 8వేల థియేటర్లకు పైగా విడుదలవుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వారం రోజుల టికెట్లు కూడా బుక్కైపోయాయి.
కాగా, బాహుబలి2 చిత్రానికి ఉన్న క్రేజ్ ను పలు సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఓ గ్యాస్ ఏజెన్సీ ఏకంగా సంచలన ప్రకటన చేసింది. వంట గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి బాహుబలి-2 సినిమా టికెట్‌ను ఉచితంగా ఇస్తామంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని హెచ్‌పీ గ్యాస్ డీలర్ ఇన్‌సాన్ గ్యాస్ ఏజెన్సీ ఈ బంపరాఫర్ ప్రకటించింది.

అంతేకాదు ఈ విషయాన్ని తెలుపుతూ పెద్దపెద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఏప్రిల్ 30లోపు కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని మెలిక పెట్టింది కూడా.
దుగ్గిరాల, రేవేంద్రపాడు గ్రామాల్లోని సినిమా హాళ్లలో ప్రదర్శితమయ్యే సినిమా టికెట్లను కనెక్షన్‌తోపాటు ఉచితంగా ఇవ్వనున్నట్టు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె శ్రీనివాస్ తెలిపారు. దీంతో పలువురు సినీ అభిమానులు గ్యాస్ కనెక్షన్ తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుండటం గమనార్హం.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications