బాలయ్య భగవంత్ కేసరి రిలీజ్; థియేటర్ వద్ద హోరెత్తిన ఎన్టీఆర్ సీఎం నినాదాలు!!
బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భగవంత్ కేసరి సినిమా థియేటర్లలోకి రానే వచ్చింది. దసరా కానుకగా వచ్చిన ఈ బాలయ్య మూవీని చూడటం కోసం అభిమానులు ఎగబడుతున్నారు. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు, కర్ణాటక రాష్ట్రంలోనూ అభిమానుల హంగామా మామూలుగా లేదు. బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్ లు పెట్టి హడావిడి చేస్తున్నారు.
డప్పుల మోతలు మోగిస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. బాలయ్య సినిమా సూపర్ హిట్ అంటూ హంగామా చేసేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య అభిమానులు సంబరాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిన్న అర్ధరాత్రి నుంచి బాలయ్య అభిమానులు హంగామా చేస్తున్నారు.

బెంగళూరులోని మార్త హళ్లిలో ఉన్న వినాయక థియేటర్లో బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాను అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంటకు స్పెషల్ షో వేశారు .ఈ షోకి భారీగా తరలివచ్చిన బాలయ్య ఫ్యాన్స్ రచ్చ చేశారు. దీపావళికి ముందే దీపావళి పండుగను తీసుకొచ్చారు. అంతేకాదు ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు.
మార్త హళ్లి లో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండడంవల్ల, అందులోనూ ముఖ్యంగా టిడిపికి మద్దతుదారులు అక్కడ ఎక్కువగా ఉండటం వల్ల బాలకృష్ణ సినిమాకు వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే భగవంత్ కేసరి సినిమాకు ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తుంది.
CM NTR slogans resounded at Sri Vinayaka Theatre Marathahalli 1 AM show on the occasion of #balayya 's #bhagavanthkesari release#ntr #balayyababu #BhagavanthKesariMania #BlockBusterBagavanthKesari #NandamuriBalakrishna #cmntr #marathahalli #Bangalore #Nandamuri pic.twitter.com/rH6WcokA2N
— Punith NTR (@Punith_NTR_) October 19, 2023
ఈ సినిమాలో బాలయ్యను అనిల్ రావిపూడి కొత్తగా చూపించారని చెప్తున్నారు. బాలకృష్ణ అంటే మాస్ కథాంశం, అనిల్ రావిపూడి అంటే కామెడీ కంటెంట్ అందరికీ గుర్తొస్తాయి. కానీ వీళ్ళిద్దరూ పంధా మార్చి చేసిన సినిమా కేసరి ప్రస్తుతం అందరినీ ఎమోషనల్ గా హత్తుకుంటుంది.ఇందులో బాలకృష్ణ వేషధారణ మాత్రమే కాదు సంభాషణలు కూడా కొత్తగా ఉంటాయని తెలంగాణ మాండలికంలో ఆయన చెప్పిన డైలాగులకు థియేటర్లు దద్దరిల్లటం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక అమ్మాయి లేడి పిల్లలా కాదు పులి పిల్లలా ఉండాలని చెప్పే కథ, దానికి ఆర్మీ నేపథ్యాన్ని జోడించి కొన్ని సంఘటనలతో బలహీనురాలు అయిన విజ్జి పాప రోల్ చేసిన శ్రీ లీలను ఆ బలహీనతల నుండి బయటకు తీసుకువచ్చి దృఢంగా తయారు చేసేలా భగవంత్ కేసరి చేసే ప్రయత్నమే ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా దేశ, విదేశాల్లో థియేటర్లలో హంగామా చేస్తుంది.












Click it and Unblock the Notifications