బాలయ్య వరల్డ్ రికార్డ్..! చంద్రబాబు సహా అభినందనల వెల్లువ..!

టాలీవుడ్ దిగ్గజ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ అరుదైన ఘనత సాధించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన ఓ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఎడిషన్ లో బాలయ్య చోటు సంపాదించారు. దీంతో బాలకృష్ణకు చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలు, కుటుంబ సభ్యుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా మరియు యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ. ఈ సంస్ధ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒక దాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణకు అందించాలని నిర్ణయించారు. దీంతో ఎన్టీఆర్ వారసుడిగా 50 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలయ్య.. ఇప్పుడు అర్ధశతాబ్దం పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించినట్లయింది.

Balakrishna Enters World Book of Records UK Gold Edition Chandrababu and Others Congratulated

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ సంతోష్ శుక్లా జారీ చేసిన అధికారిక ప్రశంసలోబాలకృష్ణ ఐదు దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిగా ప్రశంసించారు. ఇది భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్‌మార్క్‌ను స్థాపించిన వారసత్వం అన్నారు. సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయి ఉండి నిరంతరం తనను తాను పునర్నిర్మించుకునే ఆయన సామర్థ్యం, ప్రముఖ నటుడి ప్రయాణాన్ని మాత్రమే కాకుండా తరాలను కలిపే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని తెలిపారు.

బాలయ్యకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించనుండటంపై ఆయన బావ, సీఎం చంద్రబాబు ట్వీట్ లో స్పందించారు.
తరతరాలుగా ప్రజలచే ఆరాధించబడిన, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, మక్కువకు ప్రసిద్ధి చెందిన నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల పాటు ప్రధాన హీరోగా చేసిన ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలుస్తుందన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే ద్వారా గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం అన్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయిపై మన ప్రియమైన బాలయ్యకు అభినందనలు అంటూ ముగించారు.

Balakrishna Enters World Book of Records UK Gold Edition Chandrababu and Others Congratulated

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు నమోదు చేయడం చాలా సంతోషంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 50 సంవత్సరాలు హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ గారి అపూర్వమైన సినిమా జైత్రయాత్రకి అత్యంత గౌరవప్రదమైన ఘనతగా నిలుస్తుందన్నారు. బాలయ్యకు అంతర్జాతీయ గౌరవం దక్కడంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదో గొప్ప విషయం అన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ అవార్డుకి ఎంపికైన తొలి నటులు బాలకృష్ణ కావడం యావత్ తెలుగు జాతికి గర్వకారణం అన్నారు. ఇదే కోవలో పలువురు మంత్రులు, పార్టీ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు బాలయ్యకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+