అజ్ఞాతవాసిVsజైసింహా: పవన్ అభిమానిపై బాలయ్య ఫ్యాన్ దాడి, తీవ్రగాయాలు, ఉద్రిక్తత

Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: రెండు రోజుల కాల వ్యవధితో రెండు పెద్ద సినిమాలు విడుదలవడంతో వారి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జనవరి 10న ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి విడుదలైన విషయం తెలిసిందే.

  ముదిరిన మెగా-నందమూరి 'వైరం' ఒకరిపై ఒకరు దాడి !

  కాగా, జనవరి 12న మరో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన జైసింహా సినిమా విడుదలైంది. 11న రాత్రి కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోల అభిమానులు కొన్ని చోట్ల పండగ చేసుకుంటే, మరికొన్ని చోట్ల ఘర్షణ పడ్డారు.

   దాడికి దారితీసిన ఘర్షణ

  దాడికి దారితీసిన ఘర్షణ

  శ్రీకాకుళం జిల్లాలో పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ చివరికి ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వెళ్లింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

   అభిమానుల మధ్య వాగ్వాదం

  అభిమానుల మధ్య వాగ్వాదం

  శ్రీకాకుళం జిల్లాలోని పురుషోత్తపురంలో అజ్ఞాతవాసి, జై సంహా సినిమాల విషయంలో బాలయ్య, పవన్ అభిమానుల మధ్య మాటామాటా పెరిగింది. అది క్రమంగా వేడెక్కి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది.

   బ్లేడుతో దాడి చేసిన బాలయ్య అభిమాని

  బ్లేడుతో దాడి చేసిన బాలయ్య అభిమాని

  గొడవ మరింత ముదరడంతో ఓ బాలయ్య అభిమాని.. పవన్ అభిమానిపై బ్లేడుతో దాడిచేశాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థులు నెలకొన్నాయి.

   ఘటనా స్థలానికి పోలీసులు

  ఘటనా స్థలానికి పోలీసులు

  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పవన్ అభిమానిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Cine hero Balakrishna fan attacked on Tollywood Hero Pawan Kalyan's Fan in Srikakulam district.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి