చిరంజీవిని ఘోరంగా అవమానించిన బాలయ్య..కౌంటరిచ్చిన నాగబాబు
ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసిపోయారు కానీ, గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం అధిపత్యపోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కస్సును వెళ్లగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ...
రాజకీయాలు అంటే ఎమోషన్ కాదు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు. గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్ కి వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాల్లో అందరూ రాణించలేరు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు...అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటరిచ్చారు.

బ్లడ్, బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్, చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశాడు.సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే చాలామంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వడాన్ని కళ్లారా చూసి కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.
ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన ప్రజారాజ్యం కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది.ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఓ చోట ఓడిపోయి, మరో స్థానంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో చిరంజీవి ఓడిపోవడం ఆయనకు మాయని మచ్చలా నిలిచింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ చరిష్మా ముందు చిరంజీవి నిలబడలేకపోయారు.
వైఎస్ఆర్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్ హఠాత్తు మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీను ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి క్రియశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో చిరంజీవి ఓ ఫెయిల్యుర్ పొలిటిషియన్‌గా నిలిచారు.












Click it and Unblock the Notifications