బాలయ్యతో మాములుగా ఉండదు.. హిందూపురం ప్రజలకు బాలకృష్ణ వరుస శుభవార్తలు!
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం ప్రజలకు వరుస శుభవార్తలు చెప్పారు. మూడు రోజులపాటు హిందూపురంలో పర్యటిస్తున్న ఆయన నిన్న హిందూపురంలో వరుసగా సమావేశాలు, సమీక్షలతో చాలా బిజీగా గడిపారు. ఈ సందర్భంలో ఆయన హిందూపురం ప్రజలకు వరాల జల్లు కురిపించారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వవైభవం తీసుకొస్తామని బాలకృష్ణ తెలిపారు.
హిందూపురం వాసులకు బాలకృష్ణ తీపి కబురు
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి పైన గత పాలకులు నిర్లక్ష్యం వహించారని పేర్కొన్న ఆయన డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేస్తే రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం ఆసుపత్రిలో మరిన్ని ఎక్విప్మెంట్స్ తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఇక హిందూపురం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పిన బాలయ్య, హిందూపురం ప్రాంతంలో వచ్చే పరిశ్రమల పైన హిందూపురం వాసులకు తీపి కబురు చెప్పారు.

హిందూపురానికి కొత్త పరిశ్రమలు.. స్థానికులకు ఉద్యోగాలు
అనేక పెద్ద పెద్ద పరిశ్రమలు హిందూపురంలో ఏర్పాటు చేసేందుకు సుముఖతను వ్యక్తం చేస్తున్నాయని చెప్పిన బాలకృష్ణ హిందూపురం ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. ఇక్కడకు వచ్చే కొత్త పరిశ్రమలతో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ చేస్తామని భూములు కోల్పోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన చెప్పారు.
హిందూపురానికి పెద్ద పరిశ్రమలు వస్తాయని ప్రకటన
పరిశ్రమల కోసం భూములు కోల్పోయే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న బాలయ్య అందరి సంక్షేమం కోసం తను ప్రత్యేకమైన దృష్టి సారిస్తానని చెప్పారు. రైతులకు న్యాయం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. హిందూపురంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ పరిశ్రమలు రానున్నాయని, ఈ పరిశ్రమలు ఇక్కడికి వస్తే హిందూపురం రూపురేఖలు మారిపోతాయని ఎమ్మెల్యే బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ సమస్య తీరుతుందన్న బాలకృష్ణ
హిందూపురం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఇక్కడ అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీరుతుందని బాలకృష్ణ పేర్కొన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దడం తో పాటు, పరిశ్రమలతో హిందూపురాన్ని ప్రగతి బాటలో నడిపిస్తామని బాలకృష్ణ చేసిన ప్రకటనలు ఇప్పుడు హిందూపురం వాసులను సంతోషంలో ముంచెత్తాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications