బాలయ్యకు టెంపర్ లేచింది ..అభిమానికి మూడింది
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. బాలకృష్ణ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది ముక్కుసూటి తత్వం, ఆయన టెంపర్. బాలకృష్ణ చాలా సౌమ్యుడుగా కనిపిస్తారు. ఆయనలోని ముక్కుసూటి తత్వం,చిన్నపిల్లాడి మనస్థత్వం చాలామందికి నచ్చుతోంది. పైకి అలాగ కనిపిస్తారు కానీ బాలయ్య ఎంతో సరదాగా ఉంటారని సినీ, రాజకీయ సెలబ్రిటీలు చెప్పడం చాలాసార్లు విన్నాం. ఇక తేడా వస్తే ఆయన తన చేతికి పని చెబుతుంటారు. బాలకృష్ణ చాలాసార్లు తమ అభిమానులపై చేయి చేసుకున్నారు. కొట్టడం బాలయ్యకు... కొట్టించుకోవడం ఆయన ఫ్యాన్స్‌కు అలవాటుగా మారిపోయింది.
తాజాగా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక సంఘటన దీనిని మరోసారి నిరూపించింది. బాలకృష్ణ తన రాబోయే భారీ చిత్రం 'అఖండ 2' ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు, ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, స్థానిక నాయకులు తరలివచ్చారు. చుట్టూ జై బాలయ్య నినాదాలతో కోలాహలంగా ఉన్న సమయంలో, ఊహించని సంఘటన జరిగింది.

ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఉన్న సమయంలో, గుంపులో ఉన్న ఒక అభిమానిని బాలకృష్ణ గమనించారు. వెంటనే ఆయన ఆవేశంతో రెచ్చిపోయారు. ఆ అభిమానిని ఉద్దేశిస్తూ, "వీడెందుకు వచ్చాడు? వెళ్ళగొట్టండి" అంటూ పెద్దగా ఆదేశించారు. అంతేకాక, "సాయంత్రం కూడా వీడు కనపడకూడదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభిమానిపై ఆవేశంతో రెచ్చిపోయిన హీరో నందమూరి బాలకృష్ణ
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2025
అఖండ 2 సినిమా ప్రమోషన్లో భాగంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన హీరో బాలకృష్ణకు స్వాగతం పలికిన అభిమానులు
అందులో ఒక అభిమానిని వీడెందుకు వచ్చాడు, వెళ్ళగొట్టండి.. సాయంత్రం కూడా వీడు కనపడకూడదని రెచ్చిపోయిన బాలకృష్ణ pic.twitter.com/lQvF2bc20s
ఒక్కసారిగా బాలయ్య అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో, చుట్టూ ఉన్నవారంతా షాక్‌కి గురయ్యారు. ఏ కారణం చేత బాలకృష్ణ ఆ అభిమానిపై అంతటి కోపం చూపించారనే విషయంపై స్పష్టత లేదు. కొందరు అది కేవలం ఏదో చిన్న అపార్థం అయి ఉండొచ్చని అంటుంటే, మరికొందరు ఆ అభిమాని గతంలో ఏదైనా తప్పు చేసి ఉండవచ్చని ఊహిస్తున్నారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications