సైకిల్ ఎక్కలేక.. ఎక్కి తొక్కలేక.. బాలయ్య వీడియో వైరల్
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నా సందడే. అది సినిమాలో అయినా పబ్లిక్ లో అయినా తనదైన శైలిలో కనువిందు చేస్తారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో చలాకీగా కనిపిస్తారు. అటు సినిమాల్లోనూ కుర్ర హీరోలకు ధీటుగా డైలాగ్స్, యాక్షన్ తో మెప్పిస్తారు. అందుకే జై బాలయ్య అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే రీల్ లైఫ్.. రియల్ లైఫ్ ఒక్కటి కాదని బాలయ్య మర్చిపోయినట్లు ఉన్నారు. అందుకే పప్పులో కాలేసి మరోసారి వైరల్ గా మారారు.
ఢిల్లీ పార్లమెంటులో సైకిల్‌తో సందడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ pic.twitter.com/ULezw8e2c0
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2025
అయితే తాజాగా బాలయ్య దిల్లీలోని పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తమ పార్టీ గుర్తు అయిన పసుపు రంగు సైకిల్ ను ప్రత్యేకంగా తీసుకువచ్చి బాలయ్యకు అందించారు. దాన్ని చూసి ఎంతో ముచ్చటపడిన బాలయ్య..ఆ సైకిల్ ఎక్కి తొక్కేందుకు యత్నించారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ సైకిల్ ను బాలయ్య ఎక్కలేక పోయారు. దీంతో సైకిల్ వెనుక సీట్ లో కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజెన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద హీరో, అబ్బా సైకిల్ ఎక్కడం రాలేదా? అని ఒకరు.. తండ్రి స్థాపించిన పార్టీ గుర్తు అయిన సైకిల్‌నే తొక్కలేరా? అంటూ మరి కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక బాలకృష్ణ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న 'అఖండ 2' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగో సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల రిలీజైన టీజర్ కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఈ టీజర్ లో ఉన్నాయి. ఇక బాలయ్య కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ అఖండ 2 కావడం విశేషం. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ భారీ రేంజ్ లో చేయాడనికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీలో బాలయ్యతోపాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications