బాలినేని నిర్ణయం పై ఉత్కంఠ - ఏం చేయబోతున్నారు..!?

మాజీ మంత్రి బాలినేని నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన బాలినేని ఒంగోలు చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీలో బాలినేని రాజీనామా వ్యవహారం చర్చకు దారి తీసింది. పూర్తిగా పార్టీ వ్యవహారమని..అనారోగ్యం కారణంగానే బాలినేని ఒంగోలు కు పరిమితం కావాలని నిర్ణయించుకున్నారని పార్టీ ముఖ్యనేతలు చెప్పుకొచ్చారు. బాలినేని తిరిగి బాధ్యతలు చేపట్టేలా పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Balineni

వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి తన నిర్ణయం మార్చుకుంటారా లేదా అనే చర్చ సాగుతోంది. బాలినేనితో మాట్లాడి బుజ్జగించేందుకు తాడేపల్లి నుంచి ముఖ్య నేతలు ప్రయత్నాలు చేసారు. కానీ, బాలినేని మాత్రం తన నిర్ణయం పైన పునరాలోచన లేదని సన్నిహితులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. తాను ఒంగోలు నియోజకవర్గానికి పరిమితం అవుతానని తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని.. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ గెలిచేందుకు పూర్తిగా సహకారం అందిస్తానని సన్నిహితులతో స్పష్టం చేసారు. అయితే, ప్రాంతీయ ఇంఛార్జ్ గా జిల్లాల్లో నేతలకు హామీలు ఇస్తున్న సమయంలో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యులపైన ఉంటుందని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

Balineni

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆ జిల్లా సమన్వయకర్తగా బాలినేని పైన కీలక బాధ్యతలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఒప్పించి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా బాధ్యతలు కేటాయించటంలో బాలినేని కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అదే జిల్లాలో ఆత్మకూరు లో పార్టీ కొత్త ఇంఛార్జ్ నియామకం పైన చర్చ సాగుతోంది. సొంత జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయాల పైన బాలినేని అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి పదవి, అధికారుల తీరు, పార్టీలోని కొందరు ముఖ్య నేతలు శైలి తో బాలినేని అసంతృప్తికి గురయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ తో బాలినేని భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో,బాలినేని తన నిర్ణయం మార్చుకుంటారా లేదా అనే అంశం పైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+