మంచిదికాదు: ఆడియోపై దత్తాత్రేయ నో, 'హైద్రాబాద్‌లో గవర్నర్ పాలన కోసం బాబు లేఖ'

హైదరాబాద్: ప్రస్తుత పరిణామాలు (రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు ఆడియో విడుదల) రెండు తెలుగు రాష్ట్రాలకు ఆరోగ్యకరమైనవి కావని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం అన్నారు. ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే గవర్నర్ నరసింహన్‌ను కలిశానని చెప్పారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన తాను మాట్లాడనని చెప్పారు. దీనిని గవర్నర్ చూసుకుంటారని చెప్పారు.

సూత్రధారి చంద్రబాబు: ఈటెల

రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు అసలు సూత్రధారి అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. దీని నుండి చంద్రబాబు తప్పించుకోలేరన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు.

Bandaru Dattatreya meets Governor

ఇద్దరు చంద్రులవి నీతిమాలిన పనులు: పొన్నం

ఇద్దరు చంద్రులవి నీతిమాలిన పనులు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. తెరాసకు చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల ఆడియోలను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన తప్పు ఒప్పుకొని లొంగిపోవాలన్నారు. ఆడియోలను ల్యాబ్‌కు పంపితే నిజం ఎంతుందో తేలుతుందన్నారు.

చంద్రబాబుపై వేణుగోపాల చారి తీవ్ర ఆరోపణ

ఆడియో టేపుల వ్యవహారంపై రెండు రాష్ట్రాల సమస్యగా చేయవద్దని ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి అన్నారు. పరకాల ప్రభాకర్ చట్టపరంగా ఎవరి పైన పోరాడుతారో చెప్పాలన్నారు. హైదరాబాదులో గవర్నర్ పాలన కోసం కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

మాకు సంబంధం లేదు: కేటీఆర్

నోటుకు ఓటు వ్యవహారంలో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డంగా దొరికినప్పటికీ ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అడ్డంగా దొరికి కేసీఆర్ పైన బురద జల్లే పని చేస్తోందన్నారు. ఆంధ్రజ్యోతిలో తన ప్రస్తావన రావడంతో దానికి కేటీఆర్ కొత్త పేరు పెట్టారు. అది సీబీఎన్ చంద్రజ్యోతి ఛానల్ అన్నారు.

చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. వ్యక్తిగత కేసును ఇరురాష్ట్రాల సమస్యగా సృష్టించవద్దన్నారు. రేవంత్ రెడ్డిది తప్పో, ఒప్పో చంద్రబాబు చెప్పాలన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆధారాలు చూపించాలన్నారు. ఏపిలో కేసులు పెట్టి చిల్లర రాజకీయాలు చేయవద్దన్నారు. రేవంత్ వ్యవహారం తప్పని చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+