• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నువ్వేంటి స్కాం రాజా నా క్యారెక్టర్ గురించి చెప్పేది ..పీవీపీపై బండ్ల ట్వీట్ల వార్

|

టెంపర్ చిత్రానికి సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఒకరిపై ఒకరు బెదిరింపులకు పాల్పడ్డారని, ప్రాణహాని ఉందని ఫిర్యాదులు చేసుకుని కేసులు పెట్టుకున్న వైసిపి నేత పీవీపీ, బండ్ల గణేష్ ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నిన్నటికి నిన్న తెలంగాణలో చట్టాన్ని, న్యాయాన్ని డబ్బులు పెట్టి కొనలేమని , ధర్మమే జయిస్తుంది అని ట్వీట్ చేసిన బండ్ల గణేష్ ఈరోజు ట్విట్టర్ వేదికగా పీవీపీపై తిట్ల దండకం అందుకున్నారు.

జగన్ గారూ 9ఏళ్లు రక్తాన్ని ఫణంగా పెట్టారు!దుర్మార్గుల చేతిలోకా?: పీవీపీపై బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు

 సోషల్ మీడియాలో స్కాం రాజా అంటూ బండ్ల తిట్ల దండకం

సోషల్ మీడియాలో స్కాం రాజా అంటూ బండ్ల తిట్ల దండకం

గతంలో పీవీపీ గురించి బండ్ల మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న నేపధ్యంలో ఆయన స్పందిస్తూ టెంపర్ చిత్రం ఆడియో ఫంక్షన్ లో ఇస్కాం రాజా పి.వి.పి నేను కష్టాల్లో ఉన్నాను నా ఇమేజ్ పెంచు , నా గురించి కాస్త బాగా మాట్లాడు అని తన కాళ్ళు పట్టుకుని బతిమిలాడితే అప్పుడు తాను మాట్లాడానని ట్వీట్ చేశారు. ఇక స్కాం రాజా గురించి ఈ మాటలు మాట్లాడేందుకు చింతిస్తున్నాను, బాధపడుతున్నాను అంటూ మరో ట్వీట్ చేసిన బండ్ల గణేష్ పి వి పి దొంగ సంతకాలు, స్కాములు అంటూ విమర్శల వర్షం కురిపించారు.

నీ స్కాములు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పొందాయని బండ్ల ఎద్దేవా

నీ స్కాములు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పొందాయని బండ్ల ఎద్దేవా

తాను పీవీపీలా వెయ్యి వ్యవహారాలు, వెయ్యి స్కాములు చెయ్యనని నిజాయితీగా బ్రతుకుతున్నానని పేర్కొన్నారు. అంతే కాదు 30 సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లోనే ఉన్నానని, మరో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలోనే ఉంటానని ఇక్కడే చచ్చిపోతానని పేర్కొన్నారు.ఇప్పటికైనా నీతిగా నిజాయితీగా బ్రతుకు అని పీవీపీకి హితవు పలికారు. ఇక పీవీపీని స్కాం రాజా అంటూ సంబోధించిన బండ్ల గణేష్ నా అప్పులు, తప్పులు అన్నీ కలిపి నువ్ ఒక్కరోజు ముంబై లో జల్సా చేసినంత లేదు నా బ్రతుకు అని పేర్కొన్నారు. నీ స్కాం లు ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందాయని ఎద్దేవా చేశారు. ఎన్నో స్కాములకు మూలమైన నువ్వు ఎందరి జీవితాలను భ్రష్టుపట్టించావో , ఎందర్ని మోసం చేశావో అందరికీ తెలుసన్నారు.

జనం చీదరించినా సరే అది నీకు అలవాటే అన్న బండ్ల

జనం చీదరించినా సరే అది నీకు అలవాటే అన్న బండ్ల

ఇక అంతే కాదు పివిపి లాగా రోజుకు ఒక పార్టీ, గంటకు ఒక మనిషి ని మార్చడం, రోజుకు ఒకర్ని తిట్టడం, మరోరోజు పొగడటం అవసరాన్నిబట్టి ప్రవర్తించటం తనకు రాదని బండ్ల గణేష్ అన్నారు. ఒకరోజు పొగుడుతావు, ఒక రోజు భుజాన వేసుకెళ్తావు మళ్ళీ రెండో రోజు వాళ్ళ దగ్గరే టికెట్ తెచ్చుకుంటావు. జనం చీదరించినా , చీత్కారించినా అక్కడే వేలాడుతూ ఉంటావంటూ విమర్శలు గుప్పించారు. ఇక తాను పీవీపీలా కాదు అని, నమ్మినవారిని చచ్చే దాకా ప్రేమిస్తానని అది తన బ్లడ్ లో ఉందని పేర్కొన్నారు. స్కాం రాజా నీ బ్లడ్ లో అలాంటి లక్షణాలు ఏమీ లేవని బండ్ల వ్యాఖ్యానించారు.

 నా క్యారెక్టర్ ఇండస్ట్రీ పెద్ద సత్తి రంగయ్యను అడుగు అన్న బండ్ల గణేష్

నా క్యారెక్టర్ ఇండస్ట్రీ పెద్ద సత్తి రంగయ్యను అడుగు అన్న బండ్ల గణేష్

దేవుడు నీకు రెండు ఇంగ్లీష్ ముక్కలు నేర్పించి తప్పు చేశాడని మరో ట్వీట్ లో పేర్కొన్న బండ్ల గణేష్ నీ స్కాములతో దయచేసి పార్టీలను, ప్రజలను భ్రష్టు పట్టించి ఆయనకు చెడ్డపేరు తీసుకురాకు ..దయచేసి రాజకీయాలు మానుకో.. స్కాముల నుండి తప్పించుకోవడానికి లండన్ లో ఒక ఇల్లు, గోవా లో ఒక ఇల్లు కట్టుకున్నావ్.. నీ గురించి అంతా తెలుసు అంటూ మండిపడ్డారు బండ్ల. ఇక అంతే కాదు మరో ట్వీట్లో నా గురించి నా క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీ పెద్ద అయిన 50 సంవత్సరాల నుండి ఫైనాన్షియర్ గా ఉన్న సత్తి రంగయ్య గారిని అడుగు.. ఆయన నేనేంటో చెప్తారు. నువ్వేంటి స్కాం రాజా నా క్యారెక్టర్ గురించి చెప్పేది అని పేర్కొన్న బండ్ల గణేష్ క్యారెక్టర్ లేనోడా అంటూ తిట్టిపోశారు. ఈరోజు ఉదయం నుండి వరుస ట్వీట్లు పెడుతూ పి వి పి టార్గెట్ గా బండ్ల గణేష్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ ట్వీట్ లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని , ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

English summary
A verbal battle between YCP leader PVP and Bundla Ganesh, who has filed lawsuits in a financial transaction in connection with the Temper film. Ganesh, who tweeted yesterday that Telangana law and justice cannot be bought. Today he made some comments on PVP and he fired on his character .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more