విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎగసిపడుతున్న అలలు: రహదారుల కోత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రెండు మూడు రోజుల నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్దఎత్తున ఎగసిపడుతుండడంతో సముద్ర తీరం కోతకు గురవుతోంది. దీని ప్రభావం వలన ఆర్‌కె బీచ్ వద్ద గతంలో కోతకు గురైన ప్రాంతమే మళ్లీ దెబ్బతింది. బుధవారం రాత్రి నుంచి సముద్రం కోతకు గురవుతూ వస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

గురువారం ఉదయం నుంచి బీచ్ రోడ్డులో కోతను పూడ్చే పనులు మొదలుపెట్టారు. అలాగే స్థానిక తెన్నేటి పార్క్‌వద్ద కూడా అలలు బలంగా ఒడ్డుకు చేరడంతో తీరానికి సమీపంలో ఉన్న సమాధులు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. భీమిలికి సమీపంలోని మత్స్యకార గ్రామాల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరింది. యారాడ వద్ద కూడా సముద్రం సుమారు 20 మీటర్ల ముందుకు వచ్చిందని స్థానికులు తెలియచేస్తున్నారు.

కాగా, ఉత్తర కోస్తాంధ్రాలో దక్షిణ ఒడిశాను ఆనుకొని అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం గురువారం రాత్రి పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఈ కేంద్రం తెలిపింది. గురువారం విశాఖ విమానాశ్రయంలో 0.4 మిల్లీమీటర్లు, వాల్తేరులో 1.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కోతకు గురైన తీరం

కోతకు గురైన తీరం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రెండు మూడు రోజుల నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది.

రహదారి కోత

రహదారి కోత

అలలు పెద్దఎత్తున ఎగసిపడుతుండడంతో సముద్ర తీరం కోతకు గురవుతోంది. దీని ప్రభావం వలన ఆర్‌కె బీచ్ వద్ద గతంలో కోతకు గురైన ప్రాంతమే మళ్లీ దెబ్బతింది.

అధికారుల పర్యవేక్షణ

అధికారుల పర్యవేక్షణ

బుధవారం రాత్రి నుంచి సముద్రం కోతకు గురవుతూ వస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

కోతకు గురైన తీరం

కోతకు గురైన తీరం

గురువారం ఉదయం నుంచి బీచ్ రోడ్డులో కోతను పూడ్చే పనులు మొదలుపెట్టారు.

మంత్రి గంటా పర్యవేక్షణ

మంత్రి గంటా పర్యవేక్షణ

అలాగే స్థానిక తెన్నేటి పార్క్‌వద్ద కూడా అలలు బలంగా ఒడ్డుకు చేరడంతో తీరానికి సమీపంలో ఉన్న సమాధులు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.

రహదారికి కోత

రహదారికి కోత

భీమిలికి సమీపంలోని మత్స్యకార గ్రామాల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరింది.

విశాఖలో రహదారి కోత

విశాఖలో రహదారి కోత

యారాడ వద్ద కూడా సముద్రం సుమారు 20 మీటర్ల ముందుకు వచ్చిందని స్థానికులు తెలియచేస్తున్నారు.

తరలివచ్చిన జనం

తరలివచ్చిన జనం

ఇక శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో సముద్రపు అలల తాకిడికి పడవలు కొట్టుకుపోవడంతో త్స్యకారులకు భారీ నష్టం వాటిల్లింది.

ఎగుస్తున్న అలలు

ఎగుస్తున్న అలలు

ఇదిలా ఉండగా సముద్ర తీరం కోతకు గురికావడానికి ఉన్న కారణాలను అధ్యయనం చేసి, కోత నిరోధానికి తగిన చర్యలు అధికారులు తీసుకోవడం లేదు.

మరమ్మతులు

మరమ్మతులు

సుమారు మూడు నెలల కిందట కూడా విశాఖ ఆర్‌కె బీచ్‌కు సమీపంలోని కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వద్ద సముద్ర తీరం కోతకు గురైంది.

ఎగసిపడుతున్న అలలు

ఎగసిపడుతున్న అలలు

అప్పట్లో పూణే నుంచి నిపుణులను రప్పించి, కోతకు గల కారణాలపై అధ్యయనం చేయించారు.

తీరానికి కోత

తీరానికి కోత

కానీ, ఆ నివేదిక ఇప్పటి వరకూ బయటకు రాలేదు. సముద్రం కోతకు గురవడానికి ఔటర్ హార్బర్‌లోని నిర్మాణ పనులే కారణమని ప్రాథమిక అంచనా.

దారి మళ్లింపు

దారి మళ్లింపు

విశాఖ తీరం గుండా వెళ్లే రహదారికి కోతకు గురికావడంతో వాహనాలు మళ్లిస్తున్న దృశ్యం.

కూలిన గోడ

కూలిన గోడ

సముద్ర తీరం వెంబడి ఉన్న గోడ అలల ధాటికి దెబ్బతిన్న దృశ్యం.

కోతకు గురైన రహదారి

కోతకు గురైన రహదారి

అలలు పెద్దఎత్తున ఎగసిపడుతుండడంతో సముద్ర తీరం కోతకు గురవుతోంది.

English summary
Coastal erosion came back to haunt the city’s beaches for the third time in 2014 when a portion of the Beach Road collapsed on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X