దట్టమైన పొగమంచులోనూ ఏపీకి వర్ష హెచ్చరిక చేసిన బంగాళాఖాతం!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతూ ఉండడంతో తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరాన్ని చేరి తీవ్రవాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా
దీని కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని కూడా చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రం దట్టమైన పొగ మంచు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు వర్షాలు
అయితే శనివారం దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్నిచోట్ల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో చలితీవ్రత చాలా ఎక్కువగా ఉంది పాడేరు తో సహా అనేక ఏజెన్సీ ప్రాంతాలలో దట్టమైన పొగ మంచు కమ్మేసింది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ముంచంగిపుట్టులో అత్యల్పంగా 8 డిగ్రీల సెల్సియస్
పొగ మంచు ఎక్కువగా ఉన్న కారణంగా వాహనదారులు బయట రోడ్లపైన తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట కూడా లైట్లు వేసుకుని ప్రయాణాలు చేయవలసి వస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంచంగిపుట్టులో అత్యల్పంగా 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయిందని చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా పెదబయలు లో 9.4 డిగ్రీలు, జి మాడుగుల లో 9.7 డిగ్రీలు చలి నమోదయింది.
ఈ నెలాఖరు వరకు ఏపీలో చలి
హుకుంపేట లో 11.1 డిగ్రీలు, చింతపల్లిలో 11.4 డిగ్రీలు, పాడేరులో 11.5 డిగ్రీలు, అరకులోయలో 12 డిగ్రీలు, కొయ్యూరులో 14.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి .చలి అధికంగా నమోదయింది. ఏపీలో చలి ఈ నెల ఆఖరి వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో శనివారం నాడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షం పడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications