పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ విజయం కోసం తెరవెనుక త్రివిక్రమ్ తో పాటు ఈ సినీప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అఖండ విజయం సాధించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా టిడిపి కూటమిపైన చర్చ జరుగుతుంది. అందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించడంతో పాటు పోటీ చేసిన అన్నిచోట్ల గెలుపొందడంతో 100% గెలుపొందిన పార్టీగా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో 100% సక్సెస్ రేట్ ను సాధించడం వెనుక ఎంతో మంది కృషి ఉంది.
పవన్ విజయం వెనుక కీలక వ్యక్తులు వీరే
పవన్ కళ్యాణ్ కు తెర వెనుక సాయం చేసిన సినీ ప్రముఖులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ముగ్గురు పవన్ కళ్యాణ్ విజయం కోసం తీవ్రంగా కృషి చేసినట్టు చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వెనుక ఉండి మొదటి నుంచి అన్ని విధాలుగా అండదండలు అందించి ఆయన విజయానికి బాటలు వేసిన వ్యక్తి మెగా బ్రదర్ నాగబాబు.

పవన్ గెలుపు కోసం నాగబాబు కష్టం
ఈ ఎన్నికల కోసం పోటీ నుండి తప్పుకుని మరి పవన్ విజయం కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేశారు. పవన్ కోసం నాగబాబు చేసిన కష్టానికి ప్రతిఫలంగా నాగబాబుకు టిటిడి చైర్మన్ గానీ, రాజ్యసభ సీటు కానీ ఇచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీసెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ ఆర్టిస్ట్ లు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకువెళ్లటంలో మెహర్ రమేష్ కృషి
మెగా హీరోలు, జబర్దస్త్ నటులు నియోజకవర్గంలో తిష్ట వేసి ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఇక ఈ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంలో మెహర్ రమేష్ ఎంతో కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గం పై అందరి ఫోకస్ పడడానికి మెహర్ రమేష్ ప్లానింగ్ ప్రధాన కారణమని తెలుస్తుంది.
పవన్ స్పీచ్ కంటెంట్ వెనుక త్రివిక్రమ్
ఇక పవన్ కళ్యాణ్ విజయం వెనుక కీలక భూమిక పోషించిన మరొక వ్యక్తి పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆవేశపూరితమైన స్పీచ్ ల కంటెంట్ వెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ కష్టం ఉంది. అద్భుతమైన కంటెంట్ ని క్రియేట్ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు.
పవన్ కోసం కష్టపడిన నిర్మాతలు
హాయ్ ఏపీ.. బై బై వైసిపి నినాదం త్రివిక్రమ్ శ్రీనివాస్ సృష్టించింది. ఇక పవన్ కళ్యాణ్ కోసం వీరు మాత్రమే కాదు నిర్మాతలు బివి ఎస్ ఎన్ ప్రసాద్, ఏ ఎమ్ రత్నం, నాగ వంశీ, డివివి దానయ్య తదితరులు తమ పనులన్నీ పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేశారు. పవన్ కళ్యాణ్ ఇంతటి విజయం దక్కించుకోవడం వెనుక వీరందరి మద్దతు మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం కూడా ఉంది.












Click it and Unblock the Notifications