వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒత్తిడి చదువులు మనదేశంలోనే.. ఆ దేశాల్లో అలా లేదు, పిల్లలు, తల్లిదండ్రులు హ్యాపీ!

ఒత్తిడిని తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని అర్థంతరంగా తనువు చాలించడం మనం చూస్తూనే ఉన్నాం.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: మన దేశంలో విద్య.. వ్యాపారం అయిపోయాక ర్యాంకుల కోసం ఇటు విద్యా సంస్థలు, అటు తల్లిదండ్రులు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తుండడం తెలిసిన విషయమే. ఇక కార్పొరేట్ స్కూళ్ల స్టయిలే వేరు.

ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని అర్థంతరంగా తనువు చాలించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మన దేశంలోనే పరిస్థితి ఇలా ఉందా? ఇతర దేశాల్లో అసలు విద్యా విధానం ఎలా ఉంది? ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే...

జపాన్ లో నేరుగా యూనివర్సిటీకి వెళ్లొచ్చు...

జపాన్ లో నేరుగా యూనివర్సిటీకి వెళ్లొచ్చు...

మన దేశంలో విద్యను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత అంటూ పదో తరగతి లోపలే మూడు స్టేజిలుగా వర్గీకరించారు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో అయితే ఈ ప్రాథమిక విద్య కంటే ముందుగా పూర్వ ప్రాథమిక విద్య (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులు కూడా ఉంటాయి. ఆ తరువాత వరుసగా పది తరగతులూ చదువుకుంటూ వెళితేనే కాలేజీకి, ఆ పైన యూనివర్సిటీకి వెళతారు. కానీ ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశమైన జపాన్‌ మాత్రం విద్యా విధానం మనకు చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ పలానా తరగతులన్నీ చదవాలనే నియమం లేదు. హైస్కూల్‌ విద్య అభ్యసించకపోయినా సరే నేరుగా యూనివర్సిటీ విద్యనభ్యసించవచ్చు. ఇందుకు తగిన నిర్దిష్ఠ విధానం ఆ దేశంలో ఉంది.

అన్నింటికన్నా నెదర్లాండ్ బెస్ట్...

అన్నింటికన్నా నెదర్లాండ్ బెస్ట్...

మన దేశంలో చాలామంది పిల్లలు స్కూలుకు వెళ్లడానికే భయపడుతుంటారు. టీచర్ కొడుతుందనో, హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారనో తల్లిదండ్రులతో వాపోతూ ఉంటారు. నిజానికి ఏ దేశంలో పిల్లలు స్కూళ్లకు వెళ్లేందుకు అత్యంత సంతోషం కనబరుస్తారో తెలుసా? నెదర్లాండ్‌లో. అవును, ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థుల కంటే నెదర్లాండ్‌ దేశంలోని విద్యార్థులు చాలా సంతోషంగా ఉంటారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యునిసెఫ్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అక్కడి స్కూళ్లలో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు హోంవర్క్ అనేదే ఇవ్వరు. పిల్లలపై ఒత్తిడి కూడా చాలా తక్కువ.

న్యూజిలాండ్ లో 5 ఏళ్లు దాటితేనే...

న్యూజిలాండ్ లో 5 ఏళ్లు దాటితేనే...


మన దేశంలో పిల్లలకు రెండున్నరేళ్లు రాగానే స్కూలుకు తీసుకెళ్లి నర్సరీ క్లాసులో జాయిన్ చేసేస్తుంటారు. కానీ న్యూజిలాండ్‌ లో విద్యావిధానం చాలా విభిన్నమైనది. అక్కడ 5 ఏళ్లు పూర్తి అయితే కాని పిల్లల ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభం కాదు. అలాగే అక్కడి పాఠశాలల్లో మనలా తరగతి గదిలో పిల్లలంతా ఒకే చోట బల్లలు వేసుకుని కూర్చోవడం ఉండదు. చాలా పాఠశాల్లో అసలు పుస్తకాలు కూడా ఉండవు. ఉపాధ్యాయులే ప్రయోగాత్మకంగా పాఠాలు బోధిస్తారు.

ఫిన్లాండ్ లో ఆటపాటల ద్వారా...

ఫిన్లాండ్ లో ఆటపాటల ద్వారా...

ఇక ఫిన్లాండ్‌ అనుసరిస్తున్న విద్యావిధానాన్ని అమెరికా సైతం అనుసరించాలని హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ హోవర్డ్‌ గార్డెనర్‌ సూచించారంటే ఫిన్లాండ్ విద్యావిధానం ఎంత ఉత్తమంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫిన్లాండ్‌ లో ఏడేళ్ల తరువాతే పిల్లల్ని పాఠశాలల్లో చేర్చుకుంటారు. విద్యావిధానంలో కూడా ఎలాంటి ఒత్తిడి ఉండదు. పాఠాల్లా కాకుండా.. ఆటలు, పాటల రూపంలో పిల్లలకు విద్యను బోధిస్తారు. ఆటల ద్వారానే అనేక విషయాలు నేర్చుకునేలా విద్యావిధానాన్ని అక్కడి ప్రభుత్వాలు రూపొందించడం విశేషం. పాఠశాల వేళలు కూడా విద్యార్థులకు అనువుగా ఉంటాయి. మన దేశంలో పిల్లలు ఉదయాన్నే స్కూలుకు వెళితే తిరిగి సాయంత్రమే వచ్చేది. కానీ ఫిన్లాండ్ లో అలా కాదు.. పిల్లలు స్కూళ్లలో తక్కువ సమయమే గడుపుతారు.

English summary
Japan is one of the top performing countries for literacy, science, and maths in the OECD group. Students go through six years of elementary school, three years of junior high school, and three years of high school before deciding whether they want to go to university. High school is not compulsory but enrolment is close to 98%. Dutch children were found to be the happiest in the world in a 2013 Unicef study, leading the way globally educational well-being among others. Schools typically don't give much homework until secondary level and students report little pressure and stress. Schools are divided between faith schools and "neutral" state schools, with only a small number of private schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X