ఈ సెకన్ నుంచే, ఏం చేస్తాడనుకుంటే పిడుగు అయ్యారు: అఖిలప్రియ
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి పోటీ ఎందుకు పెట్టిందంటే, ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే తప్ప, మీ కోసం కాదని ప్రజలను ఉద్దేశించి మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి పోటీ ఎందుకు పెట్టిందంటే, ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే తప్ప, మీ కోసం కాదని ప్రజలను ఉద్దేశించి మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.
బుధవారం సోదరుడు బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె మాట్లాడారు. రోడ్లులేక, విస్తరణ కాక, పింఛన్లు.. రేషన్ కార్డులు అందక, పేదలకు ఇళ్లు ఇవ్వక 13 ఏళ్లు నంద్యాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు.

కొత్తగా వచ్చిన మేం ఫ్యాక్షనిస్టులమా
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన తమను వైసిపి ఫ్యాక్షనిస్టులు అనడం విడ్డూరంగా ఉందని అఖిలప్రియ ఎద్దేవా చేశారు. గుండాయిజం చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని చెప్పారు. నంద్యాలలో ఎస్సీలు, ముస్లింలపై కేసులు పెట్టింది మీరా? మేమా? అని శిల్పా మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
Recommended Video


శిల్పా గెలుస్తాడనే ఆలోచనే..
నంద్యాల ఉప ఎన్నికలో జరుగుతున్న పోటీ నీతికి-అవినీతికి అని, మంచికి, చెడుకు అని అఖిలప్రియ అన్నారు. టిడిపికి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. వైసిపికి ఓటు వేసినా శిల్పా గెలుస్తాడన్న ఆలోచన వచ్చినా మళ్లీ నంద్యాల పదమూడేళ్లు వెనక్కి పోతుందన్నారు.

ఈ సెకన్ నుంచే
భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ వేసిన సెకను నుంచి శిల్పా మోహన్ రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైందని అఖిలప్రియ అన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసిపి ఓటు అడగడానికి వస్తే.. శిల్పా మోహన్ రెడ్డి ఏం చేశారని ఓటు అడగడానికి వచ్చారని నిలదీయాలన్నారు.

భూమా నాగిరెడ్డిని అలా అన్నారు
ఆ రోజు భూమా నాగిరెడ్డి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు అన్నారని, ఈ రోజు ఆ నాగిరెడ్డే రాష్ట్రంలో పిడుగులా తయారయ్యారని అఖిలప్రియ అన్నారు. మా వెంట మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నామని, మీ పిల్లల్లా మా బాగోగుల్ని చూడాలని కోరారు.

జల్లెడ పడితే వడ్ల గింజల్లా రాలిపోతారు
బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ ర్యాలీకి తరలివచ్చిన జనాల్ని చూస్తే వైసిపి నాయకుల్లో వణుకు పుడుతుందని కేఈ కృష్ణమూర్తి అన్నారు. జల్లెడ పడితే వడ్ల గింజల్లా రాలిపోతారన్నారు. చంద్రబాబు ఏం హామీలిచ్చారో వాటిని తూచా తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. నంద్యాలకు భూమా కుటుంబం చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications