కౌరవసభలో నాడు అవమానం.. గౌరవసభలో సీఎం చంద్రబాబు ప్రమాణం: భువనేశ్వరి ఎమోషనల్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీలో మొన్న జరిగిన ఎన్నికలలో గెలిచిన శాసన సభ్యులంతా అసెంబ్లీ వేదికగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ సీఎం గా చంద్రబాబు శాసనసభలోకి అడుగుపెట్టారు. ఏపీ సీఎం గా చంద్రబాబుసభ్యుల హర్షాతిరేకాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఏపీ శాసనసభలోసీఎంగా చంద్రబాబు
175 మంది ఎమ్మెల్యేలతో ప్రోటీన్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించగా, వీరిలో 81 మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే నాడు ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సుదీర్ఘకాలం తర్వాత సభలోకి ఏపీ సీఎం గా అడుగుపెట్టారు.

Bhuvaneswari emotional post on chandrababu as cm in ap assembly reminded ycp insult in assembly

అవమానాన్ని మరచిపోని భువనేశ్వరి.. పోస్ట్
2021 నవంబర్ 19వ తేదీన అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, సీఎం అయిన తర్వాత సభలో అడుగు పెడతానని, తన భార్యను అవమానించిన కౌరవ సభలో తాను ఉండలేనని శపథం చేసి వెళ్లిపోయారు. ఆ శపధాన్ని నెరవేర్చుకున్న ఆయన నేడు సీఎంగా సభలో అడుగు పెట్టారు. నాడు తనకు జరిగిన అవమానాన్ని మరిచిపోని భువనేశ్వరి ఈరోజు సీఎంగా చంద్రబాబు సభలో అడుగుపెట్టడంతో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

ఎమోషనల్ పోస్ట్ పెట్టిన భువనేశ్వరి

ఈరోజు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ వీడియోను భువనేశ్వరి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం అంటూ ఆ పోస్టులో భువనేశ్వరి ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించి నాడు కౌరవ సభలో చంద్రబాబు ఉండలేనని, మళ్లీ సీఎం అయితేనే తిరిగి సభలో అడుగుపెడతానని శపథం చేసిన వీడియోను, ఈరోజు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను పోస్ట్ చేశారు. తెలుగు ఆత్మగౌరవం గెలిచిందన్నారు.

భువనేశ్వరి పోస్ట్ వైరల్
భువనేశ్వరి నాడు జరిగిన ఘటనను మరొకసారి గుర్తు చేశారు. ఈ వీడియో చూసిన వాళ్ళంతా నాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆడవాళ్ళను అవమానిస్తే ఇలాగే ఉంటుందని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం నారా భువనేశ్వరి చేసిన పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+