భువనేశ్వరి బూతుల షాకింగ్ ఆడియో వైరల్ .. జగన్ ఏం బ్రతుకు నీది అంటూ..
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి టిడిపి గెలుపు కోసం తనవంతుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నారా భువనేశ్వరి పేరుతో ఒక ఆడియో తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భువనేశ్వరి షాకింగ్ ఆడియో వైరల్
ఈ ఆడియో క్లిప్ లో భువనేశ్వరి తన దగ్గర పనిచేసే వాళ్ళపై బూతులతో విరుచుకుపడ్డారని, తాను పెద్దింట్లో పుట్టిన దానిని అంటూ బడుగుల మీద చెప్పరాని అసభ్య పదజాలంతో తిడుతూ తన అహంకారాన్ని ప్రదర్శించారని, దళితులపై దారుణంగా మాట్లాడారని ఆడియో క్లిప్ ను వైసిపి సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తుంది.

వైఎస్ జగన్ పై టీడీపీ సంచలన ట్వీట్
దళితులపై దారుణంగా భువనేశ్వరి బూతులతో విరుచుకుపడ్డారు అని ప్రచారం అవుతున్న ఆడియో దళిత ఓటు బ్యాంకు టిడిపి వైపు మళ్లకుండా ఉపయోగపడుతుందని భావించి వైసిపి ఈ విధంగా చేస్తున్నట్టు తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇక వైరల్ అవుతున్న ఈ ఆడియోపై ఏపీ సీఎం వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసింది.
భువనేశ్వరి ఆడియో డీప్ ఫేక్
మొన్న ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఓ టీవీ వీడియోతో ఫేక్, ఇక నేను భువనేశ్వరి ఆడియోను కూడా డీప్ ఫేక్ చేశారు అంటూ జగన్ ను టార్గెట్ చేసింది టిడిపి. భువనేశ్వరి గారంటే ఎందుకు నీకు అంత కడుపుమంట జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించింది. అసెంబ్లీలో భువనేశ్వరి గారిని బూతులు తిట్టించి నవ్వుకున్నావని, ఆడవాళ్ళని అడ్డుపెట్టుకొని ఇప్పుడు ఫేక్ ఆడియో చేశారని పేర్కొంది.
మొన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఈటీవీ వీడియోతో ఫేక్, నేడు భువనేశ్వరి గారి ఆడియోని డీప్ ఫేక్ చేశారు.
— Telugu Desam Party (@JaiTDP) April 26, 2024
జగన్ రెడ్డి... భువనేశ్వరి గారంటే ఎందుకు నీకు అంత కడుపు మంట ? అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావ్, ఇప్పుడు ఆమె ఆడియోని ఫేక్ చేసావ్...
ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని,… pic.twitter.com/XwHyQjJu9z
ఏం బ్రతుకు జగన్ నీది
భువనేశ్వరి పై బురద చల్లాలని చూస్తున్నావు అంటూ మండి పడింది. ఓట్ల కోసం ఇంతలా దిగజారుతావా .. ఏం బ్రతుకు జగన్ నీది అంటూ ఫైర్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో డీప్ ఫేక్ అని, భువనేశ్వరి ఎవరిని అసభ్య పదజాలంతో మాట్లాడరని, వైసిపి ఫేక్ బ్రతుకులు అంటూ పోస్ట్ పెట్టింది.












Click it and Unblock the Notifications