గుడివాడ గడ్డ పై మారుతున్న లెక్కలు - కలిసొచ్చేదెవరికి...!!

ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. ఈ సారి ఎన్నికల్లో గుడివాడ ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎలాగైనా అక్కడ కొడాలి నాని పైన విజయం సాధించాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. కూటమి ఏం చేసినా విజయం తనదేనని కొడాలి నాని ధీమాతో ఉన్నారు. అయితే, గతం కంటే భిన్నంగా ఈ సారి గుడివాడ రాజకీయం కనిపిస్తోంది. మారుతున్న లెక్కలతో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ పెంచుతోంది.

ప్రతిష్ఠాత్మకం
గుడివాడ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధిగా వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. 1983 నుంచి 2009 వ‌ర‌కు గుడివాడ‌లో టీడీపీకి తిరులేని ఆధిక్యం వ‌చ్చేది. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా చెప్పుకునేవారు. ఎన్టీఆర్ కూడా గుడివాడ నుంచే గెలిచారు.

Big Fight in Gudivada Kodali Nani Vs Ramu kenn contest becomes prestigious war for TDP and YSRCP

ఇక్కడ నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని అయిదో సారి బరిలోకి దిగుతున్నారు. ఇది తనకు చివరి ఎన్నికలుగా నాని చెప్పుకొచ్చారు. 2019 లో జగన్ కేబినెట్లో కొడాలి నాని మంత్రిగా పని చేసారు. టీడీపీ పైన చేసిన వ్యాఖ్యలతో కొడాలి నాని ఆ పార్టీకి టార్గెట్ అయ్యారు. రాము ఎన్నారై కావటంతో కొడాలి నాని లోకల్ అంశం తెర మీదకు తెచ్చారు. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది ఎజెండాతోనే తాను గెలుస్తానంటున్నారు

కలిసొచ్చేదెవరికి
కొడాలి నాని - రాము ఇద్దరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత మొద‌టిసారి ఇక్క‌డి నుంచే 1983లో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీచేసి విజ‌యం సాధించారు. ఆ తర్వాత 1989 ఎన్నిక‌ల్లో మిన‌హా అన్ని ఎన్నిక‌ల్లోనూ సైకిల్ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం గుడివాడ‌తో పాటు గుడ్లవ‌ల్లేరు, నందివాడ మండ‌లాలున్నాయి.

మంత్రిగా, ఎమ్మెల్యేగా వైసీపీకి కొడాలి నాని ఓ పెద్ద బ్రాండ్ అంబాసిడ‌ర్‎గా మారిపోయారు. పేద‌ల‌కు ఇచ్చిన టిడ్కో ఇళ్లు, 2000 కోట్ల‌తో నియోజ‌కవ‌ర్గంలో న‌గ‌దు బ‌దిలీ ద్వారా అందించిన సంక్షేమ ప‌థ‌కాలు త‌మ‌కు క‌లిసొస్తాయంటున్నారు. జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌ట్టాల‌ను మొత్తం 23 వేల మందికి ఇచ్చామని నాని చెబుతున్నారు.

ఉత్కంఠ పోరు
వెనిగండ్ల రాము చాలా రోజులుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ ఇతర నేతలను కలుపుకొని వెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. వచ్చే వారం చంద్రబాబు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొడాలి నాని ఈ సారి గెలవరని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అయితే, నాని మాత్రం తన గెలుపు ఎవరూ అడ్డుకోలేరని ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలతో తనకు ఉన్న సత్సంబంధాలే తన గెలుపునకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. ఈ లెక్కలతో ఈసారి గుడివాడలో సాగుతున్న హోరా హోరీ సమరంలో విజేత ఎవరనేది ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+