చంద్రబాబుకు భారీ ఊరట-బాలయ్యపై సుప్రీంకోర్టు పైర్..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ సుప్రీంకోర్టులో మరో భారీ ఊరట లభించింది. కూటమి ప్రభుత్వానికి సారధిగా ఉన్న చంద్రబాబుపై గతంలో వైసీపీ హయాంలో సీఐడీ నమోదు చేసిన కేసుల్ని సీబీఐకి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పును ప్రకటించింది.

దీంతో ఈ కేసుల్ని సీబీఐకి అప్పగించే వీలు లేకుండా పోయింది. వీటిపై సీఐడీ దర్యాప్తు మాత్రం కొనసాగనుంది.

big relief to Chandrababu as sc dismisses pleas seeking transfer of corruption cases to cbi

గతంలో ఏపీ సీఐడీ చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుతో పాటు మొత్తం ఏడు కేసులు నమోదు చేసింది. వీటిని సీబీఐకి బదలాయించాలని కోరుతూ ఏపీ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బేలా త్రివేదీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ పై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

చంద్రబాబుపై దాఖలైన కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. అంతే కాదు వీటిపై వాదించేందుకు వచ్చిన సీనియర్ లాయర్ మణీందర్ సింగ్ పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లపై కూడా మీరు వాదిస్తారా అంటూ సుప్రీంకోర్టు బెంచ్ ఆయన్ను ప్రశ్నించింది. ఇలాంటి కేసుల్లో మీలాంటి సీనియర్లు హాజరవుతారని ఊహించలేదని న్యాయమూర్తి తెలిపారు. దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ పిటిషన్ ను తోసిపుచ్చారు. దీంతో పిటిషనర్ తో పాటు ఆయన తరఫున వాదించేందుకు వచ్చిన లాయర్ కూడా షాకయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+