Kodali Nani: కొడాలి నాని కి హైకోర్టులో ఊరట-వాలంటీర్ల కేసులో కీలక ఆదేశం..!

ఏపీలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తాజాగా ఆయనపై దాఖలైన ఓ కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో కొడాలి నాని విషయంలో పోలీసులు దూకుడుగా ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట పడినట్లయింది. వాలంటీర్ల రాజీనామాల విషయంల కొడాలి నాని పాత్రపై దాఖలైన కేసులో ఆయనపై దర్యాప్తు జరుగుతోంది.

గతంలో వైసీపీ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులతోపాటు మరికొందరిపై సెక్షన్ 447, 506, రెడ్ విత్ 34 ఐపీసీ కింద గుడివాడ పోలీసులు కేసు ఇప్పటికే నమోదు చేశారు. దీంతో వీరంతా అరెస్టు కాకుండా హైకోర్టును ఆశ్రయించారు.

big relief to former ysrcp minister kodali nani as hc order against arrest in volunteers case

కొడాలి నానిని వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంలో అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని ఆయన లాయర్లు చేసిన వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఆయనకు మధ్యంతర ఊరట నిచ్చింది. ఆయనకి 41 ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే కొడాలి నానిపై జరిపే విచారణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో వాలంటీర్ల కేసులో ఇప్పటికిప్పుడు అరెస్టు కాకుండా కొడాలికి ఊరట దక్కినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+