టీడీపీకి కొలికపూడి బిగ్ షాక్..! వైసీపీ నేత పెద్దిరెడ్డితో భేటీ వీడియో వైరల్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తలనొప్పులు తెచ్చి పెడుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు మరో సంచలనం రేపారు. పార్టీలో కొంతకాలంగా అసంతృప్త ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇవాళ ఉన్నట్లుండి ఓ ఎయిర్ పోర్టులో వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలుసుకున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది బహిరంగంగానే కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో కొలికపూడి చూపు వైసీపీ వైపు మళ్లుతోందా అన్న చర్చ మొదలైంది.
ఇప్పటికే తిరువూరులో నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్టాన కూడా గుర్రుగా ఉంది. తాజాగా తిరువూరులో పోలీసు స్టేషన్ కు వెళ్లి అక్కడ ఎస్సైపై చిరుబుర్రులాడిన కొలికపూడి గంజాయి బ్యాచ్ కు సహకరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న రాత్రి వరకూ స్టేషన్ లోనే ఉండి పోలీసులకు చుక్కలు చూపించారు. దీనిపై టీడీపీ స్పందించేలోపే ఆయన ఎయిర్ పోర్టులో వైసీపీ నేత పెద్దిరెడ్డిని కలుసుకున్న వీడియో వైరల్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి తిరువూరులో గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం, పార్టీ అధిష్టానం మందలించి వదిలేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో అసలు వివాదాలకు కారణం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నియే అంటూ పలుమార్లు కొలికపూడి ఆరోపణకు కూడా చేశారు. పార్టీలో చిన్ని అధిపత్యాన్ని ఎదుర్కొని కొనసాగడం కూడా కొలికపూడికి కష్టంగా మారింది. అసలే అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న చిన్ని తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారన్న అసంతృప్తి ఆయనలో ఉంది.
అదే సమయంలో టీడీపీ అధిష్టానం కూడా వరుస వివాదాలతో కొలికపూడికి నియోజకవర్గంలో సహకారం లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన అధికారులు, పోలీసులపై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలోకి వెళ్లేందుకు కొలికపూడి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ జగన్ కు సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన వీడియో వైరల్ కావడంతో ఈ ప్రచారం మరింత ముదిరింది. దీనిపై ఇరు వర్గాలు నోరు విప్పడం లేదు. అయితే ఒక వేళ కొలికపూడి పార్టీని వీడాలని భావించినా పార్టీ ఆయన్ను బుజ్జగించే అవకాశాలు కూడా లేనట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ ఆహ్వాానించేందుకు సిద్ఘంగానే ఉంటుంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications