వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి షాక్ తగిలింది. బిజెపికి చెందిన ఇరువురు అభ్యర్థుల నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. బిజెపి నాయకులు, మాజీ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ అప్కాబ్ చైర్మన్ దేవిశెట్టి శ్రీనివాసరావు ఎ-ఫారం నిర్ణీత గడువులోపు జతచేయకపోవడంతో గురువారం నాడు పరిశీలనలో నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి మధుసూదన్ వెల్లడించారు. అలాగే బిజెపి మరో అభ్యర్థి పోలు లక్ష్మణ్‌కు పార్టీ బి ఫాం ఇవ్వకపోవడంతో ఈయన నామినేషన్‌ను కూడా తిరస్కరించినట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 21 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో హుస్నాబాద్ బరిలో 19 మంది పోటీదారులు బరిలో మిగిలారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన అనంతరం 1983లో మొట్టమొదటిసారిగా అప్పటి ఇందుర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన దేవిశెట్టి శ్రీనివాసరావుకు ఇప్పటికీ రాజకీయంగా పరిస్థితులు కలిసి రావడం లేదు. 1983 నుంచి కూడా టిడిపిలో ఉన్నా ఎపుడు ఇందుర్తి స్థానం సిపిఐకి కేటాయిస్తూ వచ్చారు. దీంతో ఇతరత పార్టీలకే ఆయన పనిచేయాల్సి వచ్చింది. కేవలం నామినేటెడ్ పదవులను మాత్రమే దక్కించుకుని మాత్రమే తృప్తి పడాల్సివచ్చింది. ఎట్టకేలకు తెలంగాణ అంశంతో భారతీయ జనతా పార్టీలో చేరితే తెలుగుదేశం బిజెపి పొత్తులో భాగంగా సీటు దక్కినా సరైన సమయంలో ఎ- ఫారం సమర్పించకపోవడంతో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవాల్సివచ్చింది.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి షాక్ తగిలింది. బిజెపికి చెందిన ఇరువురు అభ్యర్థుల నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. బిజెపి నాయకులు, మాజీ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ అప్కాబ్ చైర్మన్ దేవిశెట్టి శ్రీనివాసరావు ఎ-ఫారం నిర్ణీత గడువులోపు జతచేయకపోవడంతో గురువారం నాడు పరిశీలనలో నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి మధుసూదన్ వెల్లడించారు.

అలాగే బిజెపి మరో అభ్యర్థి పోలు లక్ష్మణ్‌కు పార్టీ బి ఫాం ఇవ్వకపోవడంతో ఈయన నామినేషన్‌ను కూడా తిరస్కరించినట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 21 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో హుస్నాబాద్ బరిలో 19 మంది పోటీదారులు బరిలో మిగిలారు.

ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన అనంతరం 1983లో మొట్టమొదటిసారిగా అప్పటి ఇందుర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన దేవిశెట్టి శ్రీనివాసరావుకు ఇప్పటికీ రాజకీయంగా పరిస్థితులు కలిసి రావడం లేదు.

1983 నుంచి కూడా టిడిపిలో ఉన్నా ఎపుడు ఇందుర్తి స్థానం సిపిఐకి కేటాయిస్తూ వచ్చారు. దీంతో ఇతరత పార్టీలకే ఆయన పనిచేయాల్సి వచ్చింది. కేవలం నామినేటెడ్ పదవులను మాత్రమే దక్కించుకుని మాత్రమే తృప్తి పడాల్సివచ్చింది. ఎట్టకేలకు తెలంగాణ అంశంతో భారతీయ జనతా పార్టీలో చేరితే తెలుగుదేశం బిజెపి పొత్తులో భాగంగా సీటు దక్కినా సరైన సమయంలో ఎ- ఫారం సమర్పించకపోవడంతో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవాల్సివచ్చింది.

English summary

 BJP Husnabad assembly seat BJP candidates in Karimanagar districts have been rejected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X