బీజేపీ కాపు అస్త్రం, గేమ్ ఛేంజర్ - టీడీపీకి షాక్, పవన్ లాక్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. తమకే అధికారం అనే ధీమాతో సీఎం జగన్ ఉన్నారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత..తమ పొత్తు కలిసి వస్తుందని చంద్రబాబు - పవన్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందనే నమ్మకంతో కనిపిస్తున్నారు. కానీ, బీజేపీ కొత్త అస్త్రాల ప్రయోగానికి సిద్దం అవుతోంది. తెలంగాణ తరహాలో ఏపీలోనూ సామాజిక అస్త్రాలను బయటకు తీస్తోంది. టీడీపీ- జనసేనను ఆత్మరక్షణలోకి నెడుతోంది.

ఏపీలో పొత్తుల లెక్కలు:ఏపీలో జగన్ ను ఓడించాలనేది చంద్రబాబు, పవన్ లక్ష్యం. అటు తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్..ఇటు ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీకి తెలంగాణలో అండగా నిలవటం ద్వారా..ఏపీలో బీజేపీ సహకారం తీసుకోవాలనేది పవన్ వ్యూహం. కానీ, ఏపీలో బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత రావటం లేదు. పవన్ తో తమ పొత్తు ఉంటుందని చెబుతున్న బీజేపీ, టీడీపీతో విధానం ఏంటనేది క్లారిటీ ఇవ్వటం లేదు. ఈ సమయంలోనే తెలంగాణలో బీజేపీ పూర్తిగా సామాజిక సమీకరణాలే గెలుపుకు అస్త్రాలుగా మలచుకుంటోంది. ఇప్పుడు ఏపీలోనూ అదే తరహాలోనే కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్దం అయినట్లు విశ్వసనీయ సమాచారం.

BJP hi command moving with new strategy in AP Elections, Who will get benefit

బీజేపీ కాపు సీఎం నినాదం:తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. దీని పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ సైతం బీజేపీ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ఇక ఏపీలో బీజేపీ కాపు సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పార్టీ ముఖ్యుల సమాచారం. కాపు వర్గానికి సీఎం పదవి ప్రకటన ద్వారా పార్టీకి సామాజికంగా కలిసి వస్తుందనేది బీజేపీ నేతల విశ్లేషణ. కాపు వర్గం గతంలో ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేనకు అండగా నిలుస్తూ నాడు చిరంజీవి, నేడు పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకుంటూ వస్తున్నారు. కానీ, పవన్ ఇప్పుడు టీడీపీకి మద్దతు ప్రకటించటం తో పాటుగా తనకు సీఎం పదవి ఇస్తే తీసుకుంటానని చెబుతున్నారు. కానీ, ఇది పవన్ అభిమానులకు..కాపు ముఖ్యులకు రుచించటం లేదు. ఇదే సమయంలో బీజేపీ వ్యూహం మార్చుతోంది. ఏపీలో టీడీపీతో పొత్తు కుదరాలంటే కాపు సీఎం నిర్ణయానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని పార్టీలో చర్చ సాగుతోంది.

కలిసొచ్చేదెవరికి:బీజేపీ ఒంటరిగా వెళ్లినా.. కూటమిగా వెళ్లినా నినాదం ఇదే ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, పవన్ ముందుగా ఈ నిర్ణయంతో ఇరకాటంలో పడే అవకాశం ఉంది. టీడీపీతో వెళ్తారా..ఈ నినాదం తో ముందుకొచ్చే బీజేపీతోనే ఉంటారా అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇక, ఈ నిర్ణయానికి టీడీపీ మద్దతు ప్రకటిస్తే చంద్రబాబు సీఎం అయ్యేందుకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. బీజేపీ నిర్ణయానికి టీడీపీ మద్దతు ఇస్తుందా..అంత త్యాగానికి చంద్రబాబు సిద్దపడతారా అనేది సందేహమే. దీంతో చంద్రబాబు -పవన్ స్పందన మొత్తం ఏపీ ఎన్నికల ఫలితాలనే మలుపు తిప్పే అవకాశం ఉంది. బీజేపీ ఇదే నిర్ణయంతో ముందుకు రావటం ఖాయమని తెలుస్తుంటంతో..ఈ సమీకరణాలు..రాజకీయం ఎవరికి కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+