Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీకి సీన్ లేదు .. వైసీపీ, టీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయం మేమే అంటున్న బీజేపీ

ఏపీలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని గట్టిగా చెప్తున్నారు బీజేపీ నేత మురళీధర్ రావు . సీఎం చంద్రబాబుపై , అలాగే అధికార పార్టీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు . చంద్రబాబు స్వయంకృత అపరాదాలే ఆయన ఓటమికి కారణం అయ్యాయని , ఏపీలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేది తామేనని, ఇక తెలంగాణాలోనూ ప్రత్యామ్నాయం మేమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు స్పష్టం చేశారు .

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మురళీధర్ రావు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పాలనపై స్పందించారు. ఏపీలో టీడీపీకి భవిష్యత్ లేదని, చంద్రబాబు మంచి ఆర్గనైజర్ కానీ చంద్రబాబుని ప్రజలు నమ్మటం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు . టీడీపీ పని అయిపోయిందని, లోకేష్‌పై పార్టీ నేతలు, కార్యకర్తలకే నమ్మకం లేదన్నారు. అందుకే నేతలందరూ వరుసగా పార్టీని వీడుతున్నారని చెప్పిన . ఇక చంద్రబాబు మంచి ఆర్గనైజరని కానీ ప్రజలు మాత్రం ఆయన్ను నమ్మడం లేదన్నారు.ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు మురళీధర్‌రావు. వైసీపీ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

BJP is the Alternative to the ruling parties in telugu states .. BJP leader Muralidhar rao

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యిందని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. . ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఆ పార్టీకి పెద్ద బలహీనతని, రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు మురళీధర్ రావు . కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని , భవిష్య‌త్‌లో టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణాలోనూ బీజేపీ అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అన్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారన్నారు మురళీధర్ రావు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి తమ పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+