భారతి సిమెంట్స్ షేర్ల విలువ పెంచి - విదేశాల్లో డబ్బుల మూటలు : సత్యకుమార్ సవాల్..!!

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీని తాము మద్దతు కోరలేదని చెప్పటం..ఆ తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం తాము వైసీపీని మద్దతు కోరామని చెప్పటం ద్వారా ఆ వ్యవహారం అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు, సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో చేసిన వ్యాఖ్యల పైన సత్య కుమార్ స్పందించారు. ఆర్దిక వ్యవహారాలపై అవగాహన లేని వ్యక్తి సీఎంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

భారతీ సిమెంట్స్ షేర్లపై

భారతీ సిమెంట్స్ షేర్లపై

రూ 10గా ఉన్న భారతీ సిమెంట్స్ షేర్లలో 51 శాతం వాటాను వైకార్డ్ సంస్థకు అమ్మగా వచ్చిన వేల కోట్లను పోలవరం నిర్వాసితులకు ఎందుకు పంచరని సత్యకుమార్ ప్రశ్నించారు. ఈ డబ్బు మొత్తం ఏ నేలమాళిగల్లో దాస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. పర్యటనల పేరుతో విమానాల్లో ఏ దేశాలకు తీసుకెళ్తున్నారనేది ప్రజలకు చెప్పాలని వ్యాఖ్యానించారు. ఆ పని చేస్తే..కేంద్రం డబ్బులు ముద్రించి పేదలకు పంచుతుందని చెప్పుకొచ్చారు. విదేశాలకు తీసుకెళ్లిన డబ్బుల మూటలు ఎక్కడ దాచిపెట్టారనే విషయాన్ని కోడ్‌ భాషలో రాసుకున్నారని, అది చెపితే ఉపయోగపడుతుందన్నారు.

అప్పులపై సమాధానం చెప్పలేకనే

అప్పులపై సమాధానం చెప్పలేకనే


పోలవరంలో ముంపు ప్రాంతం ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ఎందుకు అన్యాక్రాంతం అయ్యాయనే దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో పెరిగిన అప్పులపై సమాధానం చెప్పలేని పరిస్థితి లో ఉందన్నారు. దేశాభివృద్ధిలో భాగంగా కేంద్రం అప్పులు చేసిందని చెబుతూ..గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తీరుస్తోందని వివరించారు. కేంద్రం కంటే ఏపీ ఆర్దిక పరిస్థితి బాగుందంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సత్య కుమార్ తప్పు బట్టారు. మోదీ మీద బురద జల్లితే ఎవ్వరూ భయపడేది లేదన్నారు.

బహిరంగ చర్చకు సిద్దమంటూ

బహిరంగ చర్చకు సిద్దమంటూ


కేంద్రం చేసిన అప్పుకు ప్రతీ పైసాకు రుజువు చూపుతామని చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా కేంద్రం ఇప్పటి వరకు రూ 22 లక్షల కోట్లు నేరుగా పంచిందన్నారు. మోదీ ప్రభుత్వం ఏనాడు పత్రికా ప్రకటనలు ఇచ్చుకోలేదని..పథకాలకు తన పేరు పెట్టుకోలేదన్నారు. ధైర్యం ఉంటే మోదీ మార్క్ ..జగన్ మార్క్ అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమని సత్యకుమార్ సవాల్ చేసారు. ఇప్పుడు సత్య కుమార్ వ్యాఖ్యల పైన వైసీపీ స్పందనల ఎలా ఉంటుందనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+