సీఎంకు సీఐ శంకరయ్య నోటీసు వెనుక వారే..! బీజేపీ ఎమ్మెల్యే ఆది షాకింగ్..!

ఏపీలో సీఎం చంద్రబాబుకు వీఆర్ లో ఉన్న సీఐ శంకరయ్య తాజాగా పంపిన లీగల్ నోటీసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పరువుకు భంగం కలిగించేలా చంద్రబాబు గతంలో వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇప్పుడు లీగల్ నోటీసు పంపడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ లీగల్ నోటీసుపై స్పందించారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హంతకులే సీఐ శంకరయ్యను నడిపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.
వివేకా హత్య రక్తం మరకలు కడుగుతుంటే శంకరయ్య ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. నిందితులు వివేకా హత్యను గుండెపోటుగా చూపించి రక్తం మరకలుగా చూపిస్తే, వాళ్లు బెదిరించే ఆ విషయం చెప్పలేకపోయినట్లు శంకరయ్య చెప్పిన విషయాన్ని ఆది గుర్తుచేశారు. ఆ తర్వాత సీబీఐకి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి బెదిరించారని చెప్పాడన్నారు.

bjp mla adinarayana reddy alleges ys viveka murderers behind ci sankariah s legal notice to naidu

ఆ తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక శంకరయ్యను సస్పెండ్ చేసి వీఆర్ కు పంపిస్తే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని కోరడం ఏంటని ఆదినారాయణరెడ్డి నిలదీశారు. శంకరయ్యకు అసలు పరువు ఉంటే కదా అది పోవడానికి అన్నారు. కాబట్టి డీజీపీ హరీష్ గుప్తా శంకరయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతన్ని ఉద్యోగం నుంచి వెంటనే తప్పించాలన్నారు.

bjp mla adinarayana reddy alleges ys viveka murderers behind ci sankariah s legal notice to naidu

ఉద్యోగం కాపాడుకోసమో, ఇతరత్రా కారణాలతోనో శంకరయ్య ఇలా సీఎం చంద్రబాబుకే నోటీసు పంపారని, లేకపోతే అతనికి సీఎంకు నోటీసు పంపే స్థాయి లేదన్నారు. అతని వెనుక వివేకా హంతకులు ఉండటం వల్లే ఇలా నోటీసు పంపారని ఆరోపించారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదినారాయణరెడ్డి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+