చంద్రబాబు అరెస్ట్ పై నడ్డా ఏమన్నారు - సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు..!!
చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ నెల 19వ తేదీ తరువాతనే బయటకు రావటం పైన స్పష్టత రానుంది. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ఠ్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం స్పందించకపోవటంపైనా టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ చీఫ్ నడ్డా స్పందన పైన ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేసారు.
నడ్డాతో సీఎం రమేష్ చర్చలు:చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రంలోని ముఖ్యుల మద్దతు ఉందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. వామపక్ష నేతలు ఇవే రకమైన ఆరోపణలు చేసారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ తాను చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో జైలులో ఈ రోజు చంద్రబాబుతో పవన్ ములాఖత్ కానున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలని చంద్రబాబు, పవన్ భావిస్తున్న సమయంలో ఈ అరెస్ట్ వ్యవహారంతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. ఈ సమయంలోనే బీజేపీ అధ్యక్షుడు నడ్డా టీడీపీ అధినేత అరెస్ట్ పైన స్పందించారని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పుకొచ్చారు.

బీజేపీకి సంబంధం లేదు:చంద్రబాబు అరెస్ట్ అయిన రోజునే తాను పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి ఏపీలో పరిణామాల పైన చర్చించానని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. దీని పైన నడ్డా తనకు సమాచారం ఉందని తెలిపారని వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగా, రాజకీయ కారణాలో అరెస్ట్ చేసారని..
పార్టీ నేతలంతా ఖండించాలని సూచించారని సీఎం రమేష్ చెప్పారు. సీబీఐ ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చి వైసీపీ నేతలను విచారణ చేసిందని..కానీ, ఎఫ్ఐఆర్ లో పేరు లేని చంద్రబాబుకు నోటీసులివ్వకుండానే అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ అరెస్ట్ బీజేపీకి తెలిసే జరిగిందన్నది అబద్దమని చెప్పారు. ఈ అరెస్ట్ రాష్ట్ర పరిధిలోని సీఐడీ తప్పితే కేంద్రం ఆధ్వర్యంలోని సీబీఐ కాదని వివరించారు.

వైసీపీ పై పోరాటం చేస్తాం:వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ సిద్దంగా ఉందన్నారు. జనసేన, బీజేపీ కలిసే ఉంటాయని స్పష్టం చేసారు. మిగిలిన విషయాలను పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని సీఎం రమేష్ వెల్లడించారు.
ఇదే సమయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాలయ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీలో పరిస్థితి ఢిల్లీ పెద్దలకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. వారి ఆశీర్వాదం లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేయించే ధైర్యం జగన్ చేయగలరా అని నిలదీసారు. దీంతో ఈ పరిణామాలు పొత్తుల పైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అటు బీజేపీ మిత్రపక్షంగా.. ఇటు టీడీపీ తో సన్నిహితంగా కొనసాగుతున్న పవన్ పాత్ర కీలకంగా మారుతోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications