కనుసైగ చేస్తే.. అమరావతి కడతారు!!

భారతీయ జనతాపార్టీకి ఏ రోటికాడ ఆ పాట పాడటం అలవాటైందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పేవరకు రాష్ట్రంలోని బీజేపీ నేతలెవరూ అమరావతికి మద్దతుగా కనీసం ప్రకటన కూడా చేయలేదు. బీజేపీలోనే ఉన్న కొందరు నాయకులు (వీరు 'నేత' స్థాయికి ఎక్కువ.. నాయకుడి స్థాయికి తక్కువ) అప్పటి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తెరవెనక ఉండి విమర్శలు చేయించారనే విషయం బహిరంగ రహస్యం. అమరావతికి కన్నా మద్దతుగా మాట్లడటమే దీనికి కారణం.

భారతీయ జనతాపార్టీలోనే రెండురకాల నాయకులున్నారు. ఒక వర్గం నాయకులు అమరావతికి మద్దతు పలుకుతున్నారు. మరోవర్గం నాయకులు ఇతర పార్టీల సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్నారు. నరేంద్రమోడీ కనుసైగ చేస్తే ఏపీలోని ప్రభుత్వం వెంటనే అమరావతిని నిర్మిస్తుందని బీజేపీ నాయకులు చెబుతుంటారు. మరి రాష్ట్రంలో పరిణామాలేంటి? ఏం జరుగుతోంది? రాజధాని విషయంలో తామేం చేయాలి? అనే విషయాలపై కేంద్ర నాయకత్వానికి ఏనాడైనా నివేదిక ఇచ్చారా? అంటే దానికి వారిదగ్గర సమాధానం లేదు.

BJP playing double game with the ap capital amaravati

భారతీయ జనతాపార్టీ నైజం ఏమిటనేది అమరావతి ప్రాంతంలోని రైతులందరికీ స్పష్టంగా అర్థమైంది. కేంద్రం ఎలా వ్యవహరిస్తోంది? రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తోంది? తామేం చేయాలి? అనే విషయాలపై రైతులు ఒక స్పష్టతకు వచ్చారు. అందులో భాగంగానే అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభకు పార్టీ జాతీయ నేత సత్యకుమార్ హాజరయ్యారు.

నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు కాబట్టి దాన్ని పూర్తిచేసే బాధ్యత తమదేనన్నారు. రైతులు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అమరావతి విషయంలో తామేం చెప్పాం? ఉద్యమం చేస్తున్న రైతులకు కావల్సింది ఏమిటి? అందుకు తామేం చేయాలి? అనే ప్రశ్నలకు ఆ పార్టీ దగ్గర సమాధానం ఉన్నప్పటికీ పరామర్శలు, పలకరింపులకే వారంతా పరిమితమవుతారు. రాజధాని గ్రామాల్లో నాలుగురోజులు పాదయాత్ర చేసి హడావిడి చేసిన బీజేపీ నాయకులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. పాదయాత్రద్వారా వారు గ్రహించిన విషయాలేంటి? భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి? అనేది చెప్పకుండా ప్రభుత్వం అమరావతిని నిర్మించాలనే డిమాండ్ తో యాత్ర ముగించారు. తర్వాత ఇన్నిరోజులకు సత్యకుమార్ వచ్చారు. బీజేపీలోనే రెండు వర్గాలుగా చీలిపోయిన నాయకులకు అమరావతి అనేది వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజకీయంగా ఉపయోపడే అంశమే. అంతకుమించి ఆశించడానికి కూడా ఏమీలేదని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+