పవన్ కు బీజేపీ బిగ్ ఆఫర్, రెండు ఆప్షన్లు - ఢిల్లీ కొత్త గేమ్..!!

ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందేనేది ఉత్కంఠగా మారుతోంది. గెలుపు పైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమగా ఉన్నారు. టీడీపీ కూటమిదే విజయం అని ఆ పార్టీ నేతలు నమ్మకంతో కనిపిస్తున్నారు. ఏపీలో కూటమితో జత కట్టిన బీజేపీ రాష్ట్రంలో ఇక రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తోంది. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా..పవన్ సహకారం తో ముందుకు వెళ్లనుంది. అందులో భాగంగా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

కొత్త వ్యూహంతో బీజేపీ
ఏపీలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. కూటమితో జత కట్టిన బీజేపీ ఏపీ ఎన్నికల సరళి పైన గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తి చూపిస్తోంది. పలు మార్గాల్లో ఓటర్ల తీర్పు ఏంటనేది సూక్ష్మ స్థాయి లో తెలుసుకొనే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో ఎన్నికల ఫలితం పైన బీజేపీ దాదాపు ఒక అంచనాకు వచ్చింది. అధికారికంగా ఫలితాలు వెల్లడి తరువాత తమ కార్యాచరణ అమలు చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలో ఫలితం ఎలా ఉన్నా...పవన్ తో మాత్రం కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లు స్పష్టం అవుతోంది.

BJP promises key roles for Pawan Kalyan Deputy CM if Govt forms in AP or central minister if not

పవన్ ముందు ఆప్షన్లు
అందులో భాగంగా ఫలితాల సమయానికంటే ముందుగానే పవన్ వద్ద బీజేపీ నుంచి రెండు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించినట్లు సమాచారం. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావటం ఖాయంగా కనిపిస్తోంది. కూటమికి అధికారం దక్కకపోతే పవన్ రాజకీయ భవిష్యత్ బాధ్యతలు బీజేపీ తీసుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో కూటమి అధికారం లోకి రాకపోతే..పవన్ ను కేంద్రంలో మోదీ కేబినెట్ లో సహాయ మంత్రిని చేయాలనేది ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా విశ్వసనీయ సమాచారం. టీడీపీకి వచ్చే ఎంపీ సీట్ల ఆధారంగా వారికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఉంటుందా...లేదా అనేది నిర్ణయం కానుందని చెబుతున్నారు.

ఫలితాల తరువాత నిర్ణయం
ఏపీలో భవిష్యత్ లో పార్టీ ఎదగాలంటే పవన్ మద్దతు అవసరమని బీజేపీ నాయకత్వం గుర్తించింది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ రాష్ట్రానికి పరిమితం కానున్నారు. కూటమికి అధికారం దక్కకుంటే మాత్రం పవన్ తో కలిసి ఏపీలో బలోపేతం కావాలనేది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదన పైన పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారనుంది. అయితే, ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాతనే ఈ ప్రతిపాదనల పైన పవన్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. కూటమికి వచ్చే సీట్లు..అసెంబ్లీలో పాత్ర..గెలిచే ప్రముఖులు..ఇలా అన్నింటి పైనా స్పష్టత వచ్చిన తరువాత పవన్ పాత్ర ఏంటనేది తేలనుంది. ఆ తరువాతనే పవన్ రాజకీయ హోదా పైన ఒక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+