హైదరాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు సీజ్: ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో ఎస్‌వోటీ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి జరుపుతున్న ఈ తనిఖీల్లో పోలీసులు పేలుడుకు ఉపయోగపడే పదార్థాలను భారీస్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నైట్రో గ్లిజరిన్, అమ్మోనియా, డిటోనేటర్లు ఉన్నాయి.
ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు పట్టుబడ్డ వ్యక్తుల నుంచి సమాచార సేకరణకు విచారణ చేపట్టారు.

పసికందు అనుమానాస్పద మృతి
సికింద్రాబాద్‌కు సమీపంలోని బౌద్ధ నగర్‌లో ఐదు నెలల పాప అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే చిన్నారి తల్లి కనిపించడం లేదు. చిన్నారిని తల్లే చంపి పారిపోయి ఉంటుందని కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. చిన్నారి బంధువులు కంటతడి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జె.పొంగులూరు మండలం ముప్పవరంలో ఆగివున్న ట్యాంకర్‌ను టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications