వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరికే అమ్మ ఒడి-మేం ముందే చెప్పాం- జగన్ సర్కార్ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వ మానసపుత్రిక అయిన అమ్మఒడి పథకంపై తాజాగా ఊహాగానాలుు మొదలయ్యాయి. ఈ పథకంలో ప్రభుత్వం భారీగా కోత విధిస్తోందంటూ కొందరు, ఎత్తేస్తున్నారంటూ మరికొందరు ప్రచారాలు మొదలుపెట్టారు. దీంతో అసలైన లబ్దిదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ప్రభుత్వం ఇవాళ అమ్మఒడి పథకంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అపోహలు వద్దంటూ క్లారిటీ ఇచ్చారు.

అమ్మఒడి లబ్ధిదారుల్లో కోతపై బొత్స

అమ్మఒడి లబ్ధిదారుల్లో కోతపై బొత్స

అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు హాజరు శాతం ఆధారంగానే అమ్మ ఒడి లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితే పథకం వర్తిస్తుందని ఆయన తేల్చిచెప్పారు.

ఎవరైతే స్కూల్‌కు సక్రమంగా వస్తూ, 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. ఇదే విషయాన్ని గతంలో సీఎం జగన్, గత ప్పటి విద్యాశాఖ మంత్రి సురేష్ అనేకమార్లు స్పష్టం చేశారన్నారు. ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. ఇప్పుడు విద్యా శాఖ మంత్రిగా తాను కూడా అదే చెబుతున్నానని బొత్స తెలిపారు.

స్కూల్ కు వెళ్లకుండా అమ్మఒడా?

స్కూల్ కు వెళ్లకుండా అమ్మఒడా?

స్కూల్‌కు వెళ్లకుండా అమ్మ ఒడి పథకాన్ని ఇవ్వాలంటే ఎలా ఇస్తామని విద్యామంత్రి బొత్స ప్రశ్నించారు. స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్‌ ఉండకుండా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేలా ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని అమవు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించినప్పుడే అమలుపై మార్గదర్శకాలను స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. కాబట్టి పిల్లలను బడికి పంపించండి.. అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోండని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

 జగన్ సర్కార్ లక్ష్యమిదే

జగన్ సర్కార్ లక్ష్యమిదే

ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడి సౌకర్యాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని బొత్స కోరారు. పిల్లల్ి స్కూళ్ళకు పంపడం ద్వారా విద్యా బుద్ధులు నేర్పాలని, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని బొత్స సూచించారు. పిల్లలను చదివించేందుకు, వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్, ప్రయివేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, విద్యా బోధనతో పాటు, బైజూస్ ద్వారా, వారిలో నైపుణ్యాన్ని పెంచుతున్నామని బొత్స వెల్లడించారు.

English summary
ap education minister botsa satyanarayana on today given clarity on ammavodi scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X