చెట్టుకొమ్మ విరిగిపడి.. గొంతులోకి దూసుకెళ్లి!: విజయవాడలో విషాదం.. బాలుడి మృతి

Subscribe to Oneindia Telugu

విజయవాడ: విజయవాడ సత్యనారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసమని బయలుదేరిన హర్ష అనే బాలుడిని మృత్యువు కబళించింది. స్థానిక శిశు శిశ్యామందిర్ వద్ద చెట్టుకొమ్మ విరిగి మీద పడటంతో.. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు.. చెట్టు నానిపోయి ఉండటం.. ఈదురుగాలులకు వంగిపోయిన ఓ కొమ్మ.. అకస్మాత్తుగా బాలుడి మీద పడటంతో హర్ష అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. చెట్టు కొమ్మ హర్ష గొంతులోకి దూసుకెళ్లడంతో స్పాట్‌లో మరణించినట్లు తెలుస్తోంది.

boy killed by falling tree branch in vijayawada

మృతి చెందిన హర్ష స్థానికంగా 8వ తరగతి చదువుతుండగా.. ఘటన జరిగిన చాలాసేపటికి గానీ స్థానికులెవరూ దాన్ని గుర్తించకపోవడం గమనార్హం. మరోవైపు హర్ష తల్లి కొంత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో.. బాలుడి మృతి గురించి ఇప్పటివరకు ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A boy killed by falling tree branch in Vijayawada. Then that time he was going to bring milk packet. Police found him as Harsha who was studying 8th class
Please Wait while comments are loading...