గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు జిల్లాలో గోల్ఢ్ బిజినెస్ కు బ్రేక్...ఎందుకంటే?....

|
Google Oneindia TeluguNews

గుంటూరు:జిల్లాలో ఉన్నట్టుండి బంగారం వ్యాపారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. కారణం జిల్లాలో గోల్ఢ్ బిజినెస్ కు సంబంధించి కీలకపాత్ర పోషించే ప్రధాన పట్టణాలు నరసరావుపేట, తెనాలిలో చోటుచేసుకున్న తాజా పరిణామాలే...అవేమిటంటే?

నరసరావుపేట, తెనాలిలో బంగారు వ్యాపారులపై కస్టమ్స్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి వారి లావాదేవీల గురించి ఆరా తీస్తున్నట్లు తెలియడంతో ఆ ప్రభావం జిల్లా వ్యాప్తంగా గోల్డ్ బిజినెస్ పై పడింది. ఇక నర్సరావుపేటలో బంగారం బిస్కెట్ల వ్యాపారం వేసే ఒక ప్రముఖ వ్యాపారిని ఈ విధంగానే కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారని తెలియగానే మిగిలిన వ్యాపారులందరూ అప్రమప్తమైనట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లాలో...గోల్డ్ బిజినెస్

గుంటూరు జిల్లాలో...గోల్డ్ బిజినెస్

గుంటూరు జిల్లావ్యాప్తంగా బంగారం వ్యాపారం చేసే దుకాణాలు సుమారు 2500-3000 వరకు ఉంటాయనేది ఒక అంచనా. ప్రధాన పట్టణాల వారీగా చూస్తే
నరసరావుపేటలో 190, తెనాలిలో 400, గుంటూరులో 400, చిలకలూరిపేటలో 60, సత్తెనపల్లిలో 100, వినుకొండలో 125, పొన్నూరులో 50 వరకు బంగారం దుకాణాలు ఉన్నాయనేది వ్యాపార వర్గాల లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే షాపులు ఎన్ని ఉన్నా వ్యాపారం విషయానికొస్తే వీటిలో అత్యధికం అనధికారికంగానే సాగుతుందనేది బహిరంగ రహస్యం. ఇలా చట్టవిరుద్దంగా జరిగే వ్యాపారం కోట్లలో ఉంటుందనేది అవాస్తవం కాదు.

ఎలా చెప్పొచ్చంటే...ఇటీవలి ఘటనలు...

ఎలా చెప్పొచ్చంటే...ఇటీవలి ఘటనలు...

గుంటూరు జిల్లాలోని రొంపిచర్లలో ఆ మధ్యకాలంలో ఎటువంటి బిల్లులు లేని సుమారు 5 కిలోల బంగారం పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అలాగే నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చేసిన తనిఖీల సందర్భంగా నరసరావుపేట వ్యాపారుల బంగారమే పట్టుబడింది. అలాగే తెనాలి రైల్వేస్టేషన్లో ఇటీవలే మూడున్నర కిలోల లెక్కలు లేని బంగారు ఆభరణాలు దొరికాయి. ఈ సంఘటనలన్నింటిని క్రోడీకరించిన కస్టమ్స్ శాఖ గుంటూరు జిల్లా బంగారు వ్యాపారులపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. జిల్లాలోని కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా బంగారాన్ని జిల్లాకు తెచ్చి వ్యాపారం సాగిస్తున్నారనేదే వారి భావనగా తెలుస్తోంది.

బంగారం...స్మగ్లింగా...

బంగారం...స్మగ్లింగా...

జిల్లాలోని కొందరు వ్యాపారులు ప్రత్యేకించి బంగారం బిస్కెట్ల వ్యాపారంలో భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు కస్టమ్స్ అధికారుల విచారణలో తేలిందట. ఆ తరువాత వారే కూపీ లాగితే నరసరావుపేటలో ఏకంగా ఒక వ్యాపారి అసలు ఇంటి పేరు మారిపోయి "బంగారు బిస్కెట్ల" గా మారిపోయిందట. అలాగే తెనాలిలో రైల్వేస్టేషన్లో ఇటీవల పట్టుకున్న కోటి రూపాయల పైబడి బంగారం కూడా బిస్కెట్ల రూపంలో ఉండటం...వాటికి ఎలాంటి బిల్లులు లేకపోవడం గమనార్హం. ఈ బంగారం చెన్నై నుంచి వస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో కస్టమ్స్ శాఖ అప్రమప్తమై అసలు మొత్తం వ్యవహారం పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

బంగారం...వెండి...అక్రమ విక్రయాలు...

బంగారం...వెండి...అక్రమ విక్రయాలు...

ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు చట్ట విరుద్దంగా భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు ఇక్కడి వ్యాపారులకు...లేదా వారి ద్వారానో అమ్మకాలు జరుపుతున్న విషయం వెలుగు చూసింది. బంగారం బిస్కెట్లయితే కోయంబత్తూరు, చెన్నైల నుంచి...వెండి వస్తువులయితే సేలం నుంచి భారీ మొత్తంలోజిల్లాకు తరలివస్తున్నట్లు సమాచారం.

పట్టుబడినా...భయంలేదు...

పట్టుబడినా...భయంలేదు...

ఇలా అక్రమంగా తరలివస్తున్న బంగారు ఆభరణాలు ఒకవేళ పోలీసులకు పట్టుబడినా వారు వాటిని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగిస్తారు. అంతటితో పోలీసుల పాత్ర అయిపోతోంది. మరోవైపు కస్టమ్స్ అధికారులేమో ఆ బంగారం ఎక్కడ నుంచి వచ్చింది...పట్టుబడిన ఆభరణాలు ఎక్కడ తయారయ్యాయి... దీనివెనుక అక్రమార్కుల ప్రమేయం ఏమైనా ఉందా అని విచారించే ప్రక్రియ చేపట్టరు. దీంతో వారు కేవలం ఆ సొత్తుకు నిబంధనల ప్రకారం పన్ను విధించి తిరిగి బంగారం ఇచ్చేస్తున్నారు. దీంతో ఈ అక్రమ వ్యాపారం చేసేవారికి భయం లేకుండా పోవడంతో పాటు వారు మళ్ళీ ఇలా బంగారం చెలామణి చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లాలో బంగారం వ్యాపారంతో పాటు గోల్డ్ మర్చంట్స్ పై కస్టమ్స్‌ అధికారులు దృష్టి సారించారనడంతో ఎందుకొచ్చిన రిస్క్...కొన్నాళ్లు సైలెంటైతే పోలా అని వ్యాపారులు కార్యకలాపాలు నిలిపివేయగా...ఫలితంగా జిల్లాలో బంగారం బిజినెస్ కు బ్రేక్ పడింది.

English summary
Guntur: The gold trading in Guntur district was heavily dropped. The reason is that the customs officers are concentrated on the gold trades and traders in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X