వీడు మాములోడు కాదు: ఇద్దరితో ప్రేమాయణం.. పెళ్లయ్యాక మాజీ ప్రియురాలితో జంప్!
ఈ నెల 2వ తేదీన ఘనంగా పెళ్లి చేశారు. ఇంతలో ఇంటి పక్కన ప్రియురాలు గుర్తొచ్చింది. అంతే, పెళ్లయి వారం కూడా తిరగకుండానే భార్యకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
కుంచనపల్లి: తొలుత ఓ అమ్మాయితో ప్రేమాయణం.. అదలా సాగుతుండగానే మరో అమ్మాయిని కదలించాడు. ఆ అమ్మాయి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఒకరికి తెలియకుండా మరొకరితో.. ఇలా ఇద్దరితో ప్రేమాయణం నడిపాడు. రెండో ప్రియురాలు పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తే సరేనని అంగీకరించాడు.
విషయం పెద్దల దాకా వెళ్లింది. ఇరువురి సామాజికవర్గాలు వేరైనా.. పెద్ద మనసుతో రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయి. అనుకున్నట్లుగానే ఘనంగా పెళ్లి కూడా నిర్వహించారు. పెళ్లయి వారం రోజులు కూడా కాకముందే మాజీ ప్రియురాలు అతని మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. కట్టుకున్న భార్యను వదిలేసి.. తొలి ప్రియురాలితో ఎక్కడికో పారిపోయాడు.

తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. కుంచనపల్లికి చెందిన ఓ యువకుడు ఇంటి పక్కనే ఉన్న అమ్మాయిని ప్రేమించి ఆమెను కూడా ఒప్పించాడు. దీంతో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇదిలా ఉండగానే గుంటూరు నుంచి గ్రామానికి వలస వచ్చిన ఒక కుటుంబానికి చెందిన అమ్మాయిపై మళ్లీ మనసు పడ్డాడు.
ఆమెను కూడా ప్రేమకు ఒప్పించి.. ఆపై ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటల దాకా వెళ్లాడు. ఈ నెల 2వ తేదీన ఘనంగా పెళ్లి చేశారు. ఇంతలో ఇంటి పక్కన ప్రియురాలు గుర్తొచ్చింది. అంతే, పెళ్లయి వారం కూడా తిరగకుండానే భార్యకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆరా తీస్తే.. తెలిసిందేంటే.. సదరు వ్యక్తి మాజీ ప్రియురాలితో కలిసి ఎక్కడికో పరారయ్యాడు.
దీంతో ఏం చేయాలో తోచక యువకుడి అత్త మామ పోలీసులను ఆశ్రయించారు. కేసుల జోలికి తాము వెళ్లదలుచుకోలేదని, మా అల్లుడిని మాకు అప్పగిస్తే చాలని వారు వేడుకుంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications