‘బ్రో’ సినిమా రిలీజ్.. థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సందడి!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించగా, సముద్రఖని దర్శకత్వంలో నిర్మించబడిన సినిమా 'బ్రో'. రిలీజ్ కి ముందే బోలెడు అంచనాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సినిమా 'బ్రో'.
అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంభాషణలు రాసి స్క్రీన్ ప్లే అందించడంతో ఈ సినిమాపై బోలెడు అంచనాలు పవన్ ఫ్యాన్స్ లో ఉన్నాయి. సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయసిత్తం తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో రీ మేక్ చేసి ప్రేక్షకుల ముందుకు ఈ రోజు తీసుకువచ్చారు.

ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూసిన బ్రో సినిమా నేడు రిలీజ్ అయ్యింది. థియేటర్ లలో బ్రో సినిమా సందడి కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా చూడటానికి మంచి ఉత్సాహంతో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్ల వద్ద బ్రో సినిమా సందడి నెలకొంది.
థియేటర్ల వద్ద భారీ కటౌట్ లను పెట్టిన అభిమానులు తీన్ మార్ డ్యాన్సులు చేస్తూ హంగామా చేస్తున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వింటేజ్ యాక్షన్ తో పాటు వన్ మ్యాన్ షో అన్నట్టు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.
Junior power star #AkiraNandan at Sudharshan 🔥🔥#Bro T-Shirt esukoni mari vachadu, cult fan laga...❣️🤩🔥#BroTimeStarts | #BroTheAvatar | @PawanKalyan pic.twitter.com/ZNNeUGs2fo
— PawanKalyan FC™ (@Legend_PSPK) July 28, 2023
ఇక నేడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా రిలీజ్ కావటంతో హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ బ్రో సినిమాను అభిమానులతో కలిసి చూశారు. కాస్ట్లీ కారులో థియేటర్ కు వచ్చిన పవన్ తనయుడు అకీరా నందన్ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూశారు.
దీంతో థియేటర్ కు వచ్చిన అకీరా నందన్ ను చూసిన పవన్ ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. అకీరా తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇక ఇప్పుడు పవన్ సినిమా చూసేందుకు వచ్చిన అకీరా నందన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ తనయుడు అకీరా నందన్ సినిమాలలోకి ఎంట్రీ పై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications