కాల్ మనీ శ్రీకాంత్ మరో దందా: 450 పందెం కోళ్లు, అక్కడే యువతులపై..
విజయవాడ: కాల్ మనీ - సెక్స్ రాకెట్ నిందితుడు పెండ్యాల శ్రీకాంత్‌కు చెందిన ఫాంహౌస్‌ను పోలీసులు బుధవారం నాడు సీజ్ చేశారు. బెజవాడ సమీపంలోని అప్పారావుపేటలో శ్రీకాంత్‌కు చెందిన మూడెకరాల మామిడి తోటలో పందెం కోళ్ల ఫాంను పోలీసులు గుర్తించారు.
పోలీసులు అక్కడకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. భారీ ఎత్తున పందెం కోళ్లు కనిపించాయి. శ్రీకాంత్ కాల్ మనీ - సెక్స్ రాకెట్‌తో పాటు పందెం కోళ్లను కూడా పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ జాతులకు చెందిన పందెం కోళ్లు అక్కడ ఉన్నాయి.

ఈ ఫాంహౌస్‌లో ఉన్న ఒక్కో కోడి ధర రూ.25వేల నుంచి రూ.1 లక్ష ఆ పైన కూడా పలుకుతందని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. ఈ ఫాంహౌస్‌ను సీజ్ చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పోలీసులు దాదాపు 450 పందెం కోళ్లు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. కాగా, కాల్ మనీ - సెక్స్ రాకెట్ నిందితుడు శ్రీకాంత్ ఇదే ఫాంహౌస్‌లో మహిళల పైన లైంగిక వేధింపులకు పాల్పడే వాడని కూడా తెలుస్తోంది. అరెస్టైన ఇద్దరు విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఫాంహౌస్‌ను గుర్తించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications