Chandrababu : సిట్ పై సుప్రీం తీర్పుతో చంద్రబాబు అరెస్టు సాధ్యమేనా ?
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో నిన్న సుప్రీంకోర్టు భారీ ట్విస్ట్ ఇచ్చింది. చంద్రబాబు గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ వేస్తూ గతంలో ఏఫీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. వాటిని రద్దు చేసింది. దీంతో సిట్ విచారణకు లైన్ క్లియర్ అయిందని, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేయొచ్చనే వాదనను వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. ఇందులో సాధ్యాసాధ్యాల్ని ఓసారి పరిశీలిద్దాం..
నిన్న సుప్రీంకోర్టు తీర్పును ఓసారి చూస్తే గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో హేతుబద్ధత లేదని తేలిపోయింది. సిట్ విచారణ ప్రారంభం కాగానే దానికి బ్రేక్ వేసేలా హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో మధ్యంతర ఉత్తర్వుల్ని రద్దు చేసింది. అదే సమయంలో మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి మెరిట్ ఆధారంగా తగు నిర్ణయం ప్రకటించాలని హైకోర్టును ఆదేశించింది. అలాగే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా సమగ్ర విచారణ జరిపి తీర్పు ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ, టీడీపీ సహజంగానే భిన్నంగా స్పందించాయి. సుప్రీం తీర్పును వైసీపీ తీర్పును స్వాగతిస్తే, టీడీపీ దీని వల్ల తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చేసింది. వైసీపీ మరో అడుగు ముందుకేసి చంద్రబాబు అరెస్టు తథ్యమంటూ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టింది. సుప్రీంతీర్పుకు అనుగుణంగా సిట్ దర్యాప్తు పూర్తి చేసి చంద్రబాబును అరెస్టు చేస్తుందంటూ సజ్జల, మంత్రి ఆదిమూలపు సురేష్ వంటి వారు చెప్పేశారు. అటు చంద్రబాబు మాత్రం తాము క్లీన్ గా ఉన్నాం, భయపడాల్సిందేమీ లేదన్నారు. అయినా తమకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే జగన్ వదులుతారా అని ప్రశ్నించారు.

రాజకీయ పార్టీల వ్యాఖ్యానాల సంగతి ఎలా ఉన్నా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏం జరగబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ పెరుగుతోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో వేసవి సెలవుల తర్వాత హైకోర్టు తిరిగి ఈ కేసు విచారణ చేపట్టబోతోంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతోనూ, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనూ సంబంధం లేకుండా హైకోర్టు తిరిగి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ దర్యాప్తు అవసరమా లేదా అన్న దానిపై విచారణ చేపట్టబోతోంది. ఈ విచారణలో తిరిగి చంద్రబాబుతో పాటు గతంలో హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందిన టీడీపీ నేతలు వినిపించే వాదనల ఆధారంగా సిట్ దర్యాప్తు జరగాలా వద్దా అన్నది తేలనుంది. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు సంగతి ఉత్పన్నం అవుతుంది. అప్పటివరకూ జరిగేది మైండ్ గేమ్ మాత్రమే.
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
ఎస్సీ రిజర్వేషన్లు రద్దు!: సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications