విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరాచకాల అడ్డా 'నారాయణ', ఇంత కండకావరమా: బాబుపై బాధ్యత వేసిన రోజా

నారాయణ విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా శనివారం నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నారాయణ విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా శనివారం నిప్పులు చెరిగారు.

దెబ్బకు పవన్ కళ్యాణ్‌పై మంత్రి యూటర్న్, చంద్రబాబు అసహనం?దెబ్బకు పవన్ కళ్యాణ్‌పై మంత్రి యూటర్న్, చంద్రబాబు అసహనం?

మూడున్నరేళ్లలో దాదాపు 30 మంది విద్యార్థులు చనిపోయినా సీఎం చంద్రబాబు, విద్యా సంస్థల అధినేత నారాయణతో పాటు మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించలేదని ఆరోపించారు.

 అందుకే చర్యలు తీసుకోవడం లేదు

అందుకే చర్యలు తీసుకోవడం లేదు

నారాయణ కాలేజీలు అంటే నరకానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయని రోజా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నారాయణ బినామీ అని, అలాగే విద్యాశాఖ మంత్రి గంటాకు వియ్యంకుడు అని అందుకే చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారం తమదే అని, ఎవరూ తమను ఏం చేయలేరనే కండకావరంతో వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బాబుకు ఆడపిల్లల విలువ తెలియదు

బాబుకు ఆడపిల్లల విలువ తెలియదు

ఒకే విద్యా సంస్థలో ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా ఎలాంటి కేసు గానీ, కనీసం విచారణ గానీ చేపట్టడం లేదని రోజా అన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తున్నారే గానీ ఎలాంటి చర్యల్లేవన్నారు. చంద్రబాబుకు ఆడపిల్లల విలువ తెలియదని, టిడిపి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏ ఏడాదికి ఆ ఏడాది నేరాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు.

 అరాచకాలకు అడ్డగా నారాయణ

అరాచకాలకు అడ్డగా నారాయణ

నేరాలు పెరుగుతున్నాయని స్వయంగా డిజిపినే వెల్లడించారని రోజా అన్నారు. కళ్లు, నోరు కుట్టేసుకున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నారు. నారాయణ కాలేజీలు టిడిపి ప్రాంగణాలుగా మారాయన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు పంపించేందుకు, వారి అరాచకాలను అడ్డాగా ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.

 ఆ బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది

ఆ బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది

ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉంటే, మీరు ఏ తప్పు చేయలేదని భావిస్తే సిబిఐ విచారణకు ముందుకు రావాలని రోజా చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇన్ని చావులకు కారణమైన నారాయణ, గంటాలను బర్తరఫ్ చేయాలన్నారు. ఇక మీదట రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏ విద్యార్థి హత్య, ఆత్మహత్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం పైన ఉందన్నారు.

English summary
YSRC MLA R.K. Roja said minister Narayana was making fortune from the corpses of students and fumed at the state government for ignoring the matter even while the students were dying in a row by committing suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X