విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం యూటర్న్; క్రెడిట్ ఎవరిది? హాట్ టాపిక్!!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం వెనక్కు తగ్గింది.. అది నిన్నటి మాట.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వెనక్కు తగ్గేది లేదని కేంద్రం ప్రకటించింది. ఇది ఈరోజు మాట. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణను తాత్కాలికంగా పక్కన పెట్టామని కేంద్రమంత్రి చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని కలిగించింది.
ఇక ఈ విజయం తమదంటే తమదని అన్ని పార్టీలు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గళం తెప్పిన బి ఆర్ ఎస్, తాము పోరాటం చేయడం ప్రారంభించిన తర్వాతనే కేంద్రం వెనక్కు తగ్గిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం ఇది అని ప్రకటించారు. కేసీఆర్ దెబ్బ అలా ఉంటదన్నారు.

ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వెనక్కు తగ్గడానికి మొదటినుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా వైసిపి చేస్తున్న పోరాటమేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు వైసిపి మంత్రులు. ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కి కూడా తమదైన శైలిలో షాక్ ఇచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మెడలు వంచిన ఘనత కేసీఆర్ దేనని పేర్కొన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మరి తెలంగాణలో సింగరేణి విషయంలో ఎందుకు కేంద్రం వెనక్కు తగ్గడం లేదని ప్రశ్నించారు. ఇక సందట్లో సడేమియా అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని అనేకమార్లు కేంద్రం వద్ద తాను విజ్ఞప్తి చేసినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు.

మొత్తంగా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని, తమ వల్లే అంటే తమ వల్లే అంటూ హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం యూ టర్న్ తీసుకుంది. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది.
ఇప్పుడు ఏపీ ప్రజలు ఈ క్రెడిట్ ఎవరిది? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వెనక్కి తగ్గడం వెనుక తమ పోరాటాలే ఉన్నాయని చెప్పుకున్న నేతలు, ఇప్పుడు కేంద్రం చేసిన తాజా ప్రకటనతో ఏం సమాధానం చెప్పబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలో వేస్తారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications