ప్రభుత్వ నియామకాలు, పోస్టుల్లో మార్పులు.. ఇక నుంచి - తాజా నోటిఫికేషన్..!!

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి స్థానికత, జోనల్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌ - 1975 సవరించడం ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు జోన్లు, ఆపై రెండు మల్టీ జోన్లుగా విభజించింది. ఈ మార్పుల నేపథ్యంలో ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్థానికత, జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థపై స్పష్టత వచ్చింది. రాష్ట్రం మొత్తాన్ని ఆరు జోన్లుగా ప్రకటించి వాటిని రెండు మల్టీ జోన్లుగా విభజించింది.

రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ పైన కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆర్డర్‌ ఆర్డర్‌ను సవరించిన కేంద్రం కొత్త జోనల్, మల్టీ జోనల్ విభజనను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈ మార్పులు ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను సులభతరం చేస్తాయి. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థులు వరుసగా ఏడేళ్లు చదివిన ప్రాంతాన్ని స్థానికత అర్హతగా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇకపై ఉద్యోగ నియామకాలు కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారమే ఉంటాయి. కాగా, ఇక స్థానికులకు ప్రాధాన్యం లభిస్తుంది. 26 జిల్లాల ప్రకారం ఆరు జోన్లుగా ప్రకటించి వాటిని రెండు మల్టీ జోన్లుగా విభజించింది.

central-issues-notification-over-26-districts-division-as-zonal-and-multi-zonal

ఇక.. 7సంవత్సరాలు ఒకేచోట చదివిన ప్రాంతాన్ని స్థానికత ఆధారంగా పరిగణనలోకి తీసుకోనున్న ట్లు స్పష్టం చేసింది. మొదటి మూడు జోన్లు మల్టీ జోన్ 1గా పరిగణించారు. మొదటి జోన్​ పరిధిలో శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. 2వ జోన్ పరిధిలో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలు ఉన్నాయి. 3వ జోన్ పరిధిలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఖరారు చేసారు. ఇదే సమయంలో 4, 5, 6 జోన్లను 2వ మల్టీ జోన్​ గా ప్రకటించారు. 4వ జోన్ పరిధిలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. 5వ జోన్​ లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాలు ఉన్నాయి.

ఇక.. 6వ జోన్ ​లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు చేర్చారు. కాగా.. రాష్ట్ర విభజన అనంతరం కొత్త జిల్లాలకు అనుగుణంగా మరో 2 నూతన జోన్లు ఏర్పాటయ్యాయి. గతంలో అల్లూరి జిల్లాను కాకినాడ జోన్‌లోకి తీసుకురావాలా, లేక విశాఖ జోన్‌లో ఉంచాలా అనే విషయమై చర్చలు జరిగాయి. అల్లూరి జిల్లాను కాకినాడ జోన్‌లో ప్రతిపాదించగా ప్రతిపాదిత 6 జోన్ల వ్యవస్థలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్​ జిల్లాలను ఐదో జోన్‌లో పేర్కొన్నారు. మొత్తం 6 జోన్లతోపాటు రెండు మల్టీ జోన్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కేడర్‌ అనేది ఇక ఉండకపోవచ్చు. రాజధాని ప్రాంతంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పైన ఉండే అన్ని కేడర్లను జోనల్‌ స్థాయిగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+