Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మా నిర్ణయం వెనక్కు తీసుకుంటున్నాం - కేంద్ర మంత్రి..!!

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. రూ 11,440 కోట్ల మేర ప్యాకేజీ ద్వారా ప్లాంట్ ను పరిరక్షించామని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే, ప్లాంట్ కు ఉన్న అప్పులు .. నిర్వహణా సామర్ధ్యం... సొంత గనుల అంశం పైన ఇంకా వివాదం కొనసాగుతోంది. అదే సమయం లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల వీఆర్ఎస్ అంశం చర్చగా మారింది. ఈ సమయంలోనే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు.

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరి స్పష్టం చేసారు. విశాఖ హక్కు -ఆంధ్రుల హక్కుగా పేర్కొన్నారు. ప్లాంట్ ను స్థానిక ప్రజలు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నారని గుర్తు చేసుకున్నారు. తాజాగా కేంద్రం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే రూ 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో ప్లాంట్‌ను కాపాడేందుకు ప్యాకేజీ ఇచ్చిన తరువాత ఇక ప్రైవేటీకరణ అంశం లేనట్టేనని స్పష్టం చేసారు. ఎన్నికల సమ యంలో కూటమి పార్టీలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పాయని..ప్లాంట్‌ను అన్ని విధాల కాపాడుకుంటామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని చెప్పుకొచ్చారు.

Central minister Srinivasa Varma clarifies that no chance for Steel plant privatization

ప్లాంట్ విషయంలో కూటమి నేతలంతా ఏకాభిప్రాయంతో ఉన్నామని శ్రీనివాస వర్మ వెల్లడించారు.
ఇప్పటికే కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరుగబోదని ఇచ్చిన మాటకు
అనుగుణంగా ప్లాంట్ పునరుద్దరణ కోసం ప్యాకేజీ వచ్చేలా వ్యవహరించారని ప్రశంసించారు.
స్టీల్‌ ప్లాంట్‌ తీవ్ర నష్టాల్లో ఉన్నా.. కేంద్రం తొలివిడతగా రూ.1,600 కోట్లను విడుదల చేయగా , ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 11,440 కోట్లను కేటాయించిందని వివరించారు. ప్రజల సెంటిమెం ట్‌ను గౌరవించి కేంద్రం ఆర్థిక సాయం అందించిందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల మనోభావాలను గౌరవించి ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకుని వెల్లడించిన శ్రీనివాస వర్మ.. ప్లాంట్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+