ఏపీకి రూ. వేల కోట్లను మంజూరు చేసిన కేంద్రం

Chandrababu Naidu: ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో తుదిదశకు చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోనున్నారు.

Centre releases Rs 139750 cr to States Andhra Pradesh gets Rs 5655 72 Cr

ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ ఇచ్చింది. వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. జూన్‌ నెలలో ట్యాక్స్ డెవల్యూషన్‌లో భాగంగా విడుదల చేసిన నిధులు ఇవి. అదనంగా మరో ఇన్‌స్టాల్‌మెంట్‌ను కూడా కేంద్రం ఇందులో జమ చేసింది. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, మూల ధన వ్యయాల కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుంది.

ఏపీ సహా మిగిలిన రాష్ట్రాలన్నింటికీ కలిపి 1,39,750 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో రాష్ట్రాలకు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం 12,19,783 కోట్లు. ఇందులో భాగంగా ఈ నిధులు విడుదల అయ్యాయి.

ఏపీ వాటాగా 5,655.72 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్- రూ.2,455.44, అస్సాం- రూ. 4,371.38, బిహార్- రూ. 14,056.12, ఛత్తీస్‌గఢ్- రూ. 4,761.30, గోవా- 539.42, గుజరాత్- 4,860.56, హర్యానా- 1,527.48, హిమాచల్ ప్రదేశ్- రూ. 1,159.92 కోట్లు విడుదల అయ్యాయి.

జార్ఖండ్- రూ. 4, 621.58, కర్ణాటక- రూ. 5,096.72, కేరళ- రూ. 2,690.20, మధ్యప్రదేశ్- రూ. 10,970.44, మహారాష్ట్ర- రూ. 8,828.08, మణిపూర్- రూ.1,000.60, మేఘాలయ- రూ. 1,071.90, మిజోరం- రూ. 698.78, నాగాలాండ్- రూ. 795.20, ఒడిశా- రూ. 6,327.92 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

పంజాబ్- రూ. 2,525.32, రాజస్థాన్- రూ.8,421.38, సిక్కిం- రూ. 542.22, తమిళనాడు- రూ. 5,700.44, తెలంగాణ- రూ. 2,937.58, త్రిపుర- రూ.989.44, ఉత్తర ప్రదేశ్- రూ. 25,069.88, ఉత్తరాఖండ్- రూ. 1,562.44, పశ్చిమ బెంగాల్- 10,513.46 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+