అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతికి షాక్: ప్రపంచ బ్యాంక్ రుణానికి కేంద్రం కోత

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ షాక్ ఇచ్చింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన రుణంలో కేంద్ర ప్రభుత్వం సగం కోత పెట్టింది. అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకోదలిచిన రుణంలో కేంద్రం సగం కోత పెట్టింది.

వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింది ఆర్థిక వ్యవహారాల శాఖ మాప్తివో 1 బిలియన్ అమెరికా డాలర్ల రుణం పొందడానికి అనుమతి ఇచ్చింది. అయితే, దా్ని ఇప్పుడు 500 మిలియన్ డాలర్లకు తగ్గించింది. ఈ మేరకు సోమవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నుంచి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపామని, అయితే, అంత మొత్తాన్ని ఒకేసారి పొందడానికి నిబంధనలు అంగీకరించబోవని తెలిసిందని, దీంతో రుణ ప్రతిపాదనను సగానికి తగ్గించామని సంబంధిత అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా రాసింది.

Centre shocks AP, trims loan amount needed for Amaravati by half

అమరావతి తొలి దశ నిర్మాణానికి 500 మిలియన్ డాలర్ల రుణానికి భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని ప్రపంచ బ్యాంక్ అధికారులు నిర్ధారించినట్లు దక్కన్ క్రానికల్ రాసింది. ప్రాజెక్టును రూపొందించడానికి సిఆర్‌డిఎతోనూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ ప్రస్తుతం పనిచేస్తున్న ప్రపంచ బ్యాంక్ ఇంకా రుణ మొత్తానికి ఆమోదం తెలపాల్సి ఉంది.

రుణాన్ని ఇంకా ఆమోదించలేదని మాత్రమే ప్రపంచ బ్యాంక్ చెప్పిందని, తిరస్కరించామని మాత్రం చెప్పలేదని అంటున్నారు. రుణ మంజూరులో జాప్యం చేసినా, ప్రతిపాదనను తిరస్కరించినా అమరావతి నిర్మాణం పనులు స్తంభించిపోతాయని అంటున్నారు.

English summary
Andhra Pradesh was in for a rude shock when the Centre cut down by half the quantum of loan that the state wanted to secure from the World Bank for construction of its new capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X