టిడీపీలో సీనియర్లకు ఒక రూల్ - ఆ బిగ్ షాట్ కు మరో రూల్..!!
ఏపీలో మూడు పార్టీల కూటమి తమ అభ్యర్థులను ఫైనల్ చేసింది. టిడిపి నుంచి 144, జనసేన 21, బిజెపి 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంది. టిడిపిలో పలువురు సీనియర్లకు టికెట్లు దక్కలేదు. అందులో తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారు కూడా ఉన్నారు. కొందరు సహకరిస్తుండగా మరికొందరు చంద్రబాబు నిర్ణయంతో విభేదించారు. పలువురు సీనియర్ల కుటుంబాల్లో టికెట్ల కోసం పోటీ నెలకొంది. సీనియర్ నేతల వారసులు సైతం సీట్లు ఆశించారు. కానీ ఒక్కో కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు ఎలక్షన్ ఫార్ములాగా డిసైడ్ అయ్యారు.
సీనియర్లకు ఒక్కటే సీట్
అదే ఫార్ములాగా అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో జెసి, పరిటాల, అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు కేఈ తో సహా పలువురు సీనియర్ల కుటుంబాలకు ఒక్క సీటు మాత్రమే దక్కింది. చివర నిమిషం వరకు ప్రయత్నించిన సీనియర్లు చివరకు రాజీ పడ్డారు. అయితే సీనియర్లకు ఒక్క సీట్ ఫార్ములా అమలు కాగా పార్టీలో కొత్తగా చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి రెండు సీట్లు దక్కాయి. ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా, ఆయన సతీమణి ప్రశాంతి కోవూరు ఎమ్మెల్యేగా సీట్లు దక్కించుకున్నారు.

చంద్రబాబు ఫార్ములా
చంద్రబాబు కుటుంబంలో ఇద్దరు పోటీలో ఉన్నారు. చంద్రబాబు కుప్పం నుంచి, లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. కాగా మరే కుటుంబానికి రెండు సీట్లు దక్కలేదు. అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ కి సీటు కోసం చివరిదాకా ప్రయత్నించారు. పరిటాల సునీత తన కుమారుడికి ధర్మవరం సీటు కావాలని కోరారు. సీనియర్ నేత జెసి తన కుమారుడు పవన్ కు అనంతపురం ఎంపీ సీటు ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కుటుంబాల నుంచి ఒక్కరికే సీటు దక్కింది.
బిగ్ షాట్ కు రెండు సీట్లు
నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా సీటు దక్కించుకున్నారు. సీనియర్లకు ఒక సీటు మాత్రమే ఇస్తున్నానంటూ అందరికీ నచ్చ చెప్పిన చంద్రబాబు.. వేమిరెడ్డి మాత్రం పార్టీలో చేరిన వెంటనే రెండు సీట్లు కేటాయించడం పైన ఇప్పుడు సీనియర్ల మధ్య అంతర్గతంగా చర్చ మొదలైంది. నెల్లూరు సమీకరణాల్లో భాగంగా ఇద్దరికీ సీటు ఇవ్వాల్సి వచ్చిందని పార్టీ నాయకత్వం చెబుతున్నా.. ఇప్పుడు ఈ వ్యవహారం మాత్రం సీనియర్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications