ఓటమి భయంతో ...మోడీపై, కేసీఆర్ పై బురద చల్లే డ్రామాలు చేస్తున్న చంద్రబాబు .. జీవీఎల్ ఫైర్

Recommended Video

    ఓటమి భయంతో మోడీపై,KCR పై విమర్శలు చేస్తున్న చంద్రబాబు : జీవీఎల్

    ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబుకు ఓటమి ఖాయమని చెప్పిన జీవీఎల్ ఓటమి భయంతోనే చంద్రబాబు నోరులేని ఈవీఎంలపై . ఈసీపై నేరం నెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రధాని మోడీపై, కేసీఆర్ పై బురద చల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు .

    ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడరాదని తాను 2010లో ఓ పుస్తకం రాసిన మాట వాస్తవమేనని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రాలను అనుసంధానం చేయలేదని తెలిపారు.ఈవీఎంల్లో మార్పు తీసుకురావాలని తాను బలంగా కోరుకున్నానని చెప్పారు. తమ పోరాటం కారణంగానే ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రాలను అనుసంధానించారని తెలిపారు. 'ఇప్పుడున్న ఈవీఎంలను 2014 వరకూ ఉన్న ఈవీఎంలతో పోల్చడం తప్పు. ఏపీలోని మూడు కోట్ల మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే తమ ఓటు ఏ పార్టీకి పడిందో వారంతా చూసుకోగలిగారని తెలిపారు జీవీఎల్ .

    Chandra Babu is doing dramas by the fear of loosing and he alligating on KCR and Modi ...GVL fired

    చంద్రబాబు నాయుడు 2014లో ఎలా గెలిచారో అందరికీ తెలుసన్నారు జీవీఎల్ . పేపర్ ట్రయల్ లేకుండానే ఈవీఎంల ద్వారా గెలిచారని గుర్తు చేశారు . ఇప్పుడు ఓడిపోతున్నామని తెలియడంతో తమ ఓటమి కారణాలను నోరు లేని మెషీన్లపై , ఈసీపై తోసెయ్యాలని చూస్తున్నారన్నారు . ఇక భారత ప్రధాని మోడీపై, కేసీఆర్ పై బురద చల్లడానికి చంద్రబాబు చేస్తున్న డ్రామానే ఇది అని మండిపడ్డారు. 'వీవీప్యాట్లలోని స్లిప్పులను 50 శాతం లెక్కించినా, 10 శాతం లెక్కించినా వచ్చే ఓట్లలో తేడా ఏమీ ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ బాక్సు బద్దలవటం ఖాయం అని తేల్చి చెప్పారు . ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పులను 10 శాతం లెక్కించినా, 50 శాతం లెక్కించినా తమకు అభ్యంతరం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు విపక్షాలు వేసిన రివ్యూ పిటీషన్ కొట్టేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+