Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో ఎన్నికల హామీ అమలుపై చంద్రబాబు కీలక నిర్ణయం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నెలకు రూ 4 వేల పెన్షన్ అందిస్తోంది. ఇదే సమయంలో తాజాగా సీఎం చంద్రబాబు మచిలీపట్నం వేదికగా మరో ముఖ్య నిర్ణయం ప్రకటించారు.

ఏపీలో చెత్త పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెత్త మీద పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నామని చెప్పారు. వచ్చే క్యాబినెట్‌లో పెట్టి ఆదేశాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారులు కూడా చెత్త పన్నును ఇకపై వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మచిలీ పట్నంలో స్వచ్చ సేవ ప్రజావేదిక సభలో పాల్గొన్న సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. చెత్తపన్ను గురించి ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు నిర్ణయం ప్రకటించారు.

Chandra Babu orders for abolish of Garbage tax key appeal for AP people

గ్రామ పంచాయతీల్లో సాలిట్ వేస్ట్ సెంటర్లను గతంలో తాము ఏర్పాటు చేశామని.. అయితే చెత్తను తీసుకుపోవడం మానేసి, షెడ్లకు సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. రోడ్ల మీద చెత్త ఉండేందుకు వీలు లేదు.. ఎన్ని ఫ్లాంట్లు అయినా పెడతామని చెప్పారు. చెత్త నుంచి కరెంటు తయారీ ప్లాంట్లను పునరుద్ధరిస్తామన్నారు. ప్రతిఒక్కరూ స్వచ్చ సేవకులు కావాలి.. స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాధించాలని సూచించారు గాంధీ జయంతిన 2029 కి ఏపీ స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌గా తయారు కావాలని మనం సంకల్పం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

విజయవాడలో వచ్చిన వరదలలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు వచ్చిందన్నారు. విజయవాడ మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితికి వచ్చిందన్నారు. ఆరేడు అడుగుల నీరు రోడ్లపైనా, ఇళ్లల్లో నిలిచిందని... నీరు పోయే పరిస్థితి లేక.. పై నుంచి వస్తున్న నీటితో తల్లడిల్లామని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు. లక్షలాది మంది ప్రజలకు అవసరమైన సేవలు అందించామన్నారు. ప్రజల కోసం బురదలో నడిచానని, పొక్రెయిన్ ఎక్కా.. వరద నీటిలోకి వెళ్లామని వెల్లడించారు. పింగలి వెంకయ్య పేరు మీద కాలేజీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+