నన్ను అరెస్ట్ చేస్తారు..జైళ్లో ఉంటాను : ఖబడ్దార్ మోదీ : ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు..!
Recommended Video

విశాఖపట్టణం : ఎన్నికల సంఘం తాజా నిర్ణయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎలా బదిలీ చేస్తారంటూ నిలదీసారు. ప్రధాని మోదీ అంతు చూస్తామంటూ చెలరేగారు. రేపో..మాపో నన్ను అరెస్ట్ చేస్తారు. చేసుకోండి..భయపడను అంటూ గర్జించారు. వైసిపి పై తాము ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని ఎన్నికల సంఘం తప్పు చే యని అధికారుల పై మాత్రం చర్యలు తీసుకుంటుందని ఫైర్ అయ్యారు.
నన్ను అరెస్ట్ చేస్తారు..జైళ్లో పెడతారు..
విశాఖ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠ ను ఎన్నికల సంఘం బదిలీ చే సిందనే సమాచారం ముఖ్యమంత్రి కి అందింది. అప్పటి వరకు ఎన్నికల ప్రచారం లో ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం..మోదీ తనను ఏకాకి ని చేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. నేనే ఏం తప్పు చేసాను అని ప్రశ్నించారు. నేను వారికి ఊడిగిన చేయాలా అని నిలదీసారు. ఎటువంటి తప్పు చేయని ఇంటలి జెన్స్ డిజి..సీయస్ ను బదిలీ చేసారని మండి పడ్డారు. రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు..జైళ్లో పెడతారు అయినా సరే జైళ్లో కూర్చుంటా..భయపడను అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ప్రధాని మోదీని వదిలేది లేదని..అంతు చూస్తామని చెబుతూనే ఖబడ్దార్ మోదీ అంటూ హెచ్చరించారు.

మోదీ..షా ను బహిష్కరిద్దాం..
ప్రజాస్వామ్యాన్ని విలువ లేకుండా చేసిన ప్రధాని మోదీ..బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కు బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు. టిడిపి అభ్యర్దులను లక్ష్యంగా చేసుకొని ఐటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్మ పోరాటం చేయటమే నేను చేసిన తప్పా అని ప్రశ్నించారు. వైసిపి దొంగ ఓట్ల పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వివరించారు. ఎన్నికల సంఘం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నిక ల్లో ఇవియం లతో పాటుగా వివి ప్యాడ్స్ స్లిప్ లను లెక్కించాలని కోర్టుకు వెళ్లామని..పోరాడుతామని స్పష్టం చేసారు.తనను ఏకాకి ని చేసి దాడులు చేయాలని చూస్తున్నారని..తాను ఏకాకిని కాదని తేల్చి చెప్పారు. తానెప్పుడూ నేరాలు చేయలేదని నేరాలు చేసిన వారిని వదల్లేదని చెప్పుకొచ్చారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications