ప్రక్షాళన షురూ - చంద్రబాబు సీఎంఓ టీం సిద్దం..!!
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకు ముందే పాలనా పరంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. జగన్ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని తప్పిస్తున్నారు. సీఎస్, డీజీపీ తోపాటుగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను చంద్రబాబు ఎంపిక చేస్తున్నారు. పాలన ప్రారంభానికి సిద్దం అవంుతున్నారు.
చంద్రబాబు నిర్ణయాలు
చంద్రబాబు మార్క్ నిర్ణయాలు అమలవుతున్నాయి. అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవు పైన వెళ్లాల్సిందిగా ఆదేశాలు అందాయి. ఈ నెలాఖరున జవహర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. తనకు అందిన సూచనల మేరకు జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శిగా జగన్ హాయంలో పని చేసిన రావత్ అనారోగ్య కారణాల తో సెలవు పై ఉన్నారు. ఇక..చంద్రబాబు తన పాలన ప్రారంభానికి ముందే సీఎస్..డీజీపీ...ఇంటలిజెన్స్ చీఫ్ ల నియామకం పైన కసరత్తు పపూర్తి చేసిట్లు తెలుస్తోంది.

సీఎంఓ సిద్దం
చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి మంత్రులతో కొత్త కేబినెట్ కూర్పు పై కసరత్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలకు ముందే తన టీం ను చంద్రబాబు ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో 2014-19 వరకు తన కార్యాలయంలో పని చేసిన ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్, గిరిజా శంకర్ కు తిరిగి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటుగా సిద్దార్ద జైన్ ను సైతం సీఎంఓలోకి ఎంపిక చేసినట్లు సమాచారం. వీరి నియామకాల పైన అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. మరిన్ని నియామకాల గురించి కసరత్తు జరుగుతోంది.
సెలవు పై జవహర్ రెడ్డి
జవహర్ రెడ్డి బుధవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం. జవహర్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ముభావంగా ఉన్నారు. ఆ సమయంలోనే కొన్ని విషయాలు వివరించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా, ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదులిచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో,జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లటంతో ఈ సాయంత్రం ఏపీ నూతన సీఎస్ నియామకం పైన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications